Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BARC Recruitment 2022: BARCలో గ్రూప్ A పోస్టులకు చివరి తేదీ పొడిగింపు..ఇంజినీరింగ్‌ చేసినవారికి అవకాశం!

గేట్‌ 2022 స్కోర్ ద్వారా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో గ్రూప్ A పోస్టుల భర్తీకి చివరి తేదీని పొడిగించింది..

BARC Recruitment 2022: BARCలో గ్రూప్ A పోస్టులకు చివరి తేదీ పొడిగింపు..ఇంజినీరింగ్‌ చేసినవారికి అవకాశం!
Barc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2022 | 12:54 PM

BARC Recruitment 2022 Online Registration deadline : గేట్‌ 2022 స్కోర్ ద్వారా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో గ్రూప్ A పోస్టుల భర్తీకి చివరి తేదీని పొడిగించింది. దీంతో ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే ఫిబ్రవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు బార్క్‌ అధికారిక సైట్ barconlineexam.inలోని ద్వారా దరఖాస్తు చేయవచ్చు. కాగా బార్క్‌ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ పరీక్ష స్లాట్ బుకింగ్ మార్చి 4 నుండి మార్చి 18, 2022 వరకు అందుబాటులో ఉంటుంది
  • ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి13 వరకు జరుగుతాయి.
  • గేట్ స్కోర్‌ను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ: ఏప్రిల్ 13, 2022.

అర్హతలు: బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2021-22లో వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, గేట్‌ 2021-22 స్కోర్‌ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుమ:

  • పురుషులు, జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ, ఎస్టీ, మ‌హిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2022.

పూర్త సమాచారం కోసం క్లిక్‌ చెయ్యండి.

Also Read:

ICAI CA May Exam 2022: సీఏ మే – 2022 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు…