NIMS Recruitment: నిమ్స్‌ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..

NIMS Recruitment: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉన్న ఈ వైద్య సంస్థలో పలు ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NIMS Recruitment: నిమ్స్‌ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..
Nims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2022 | 3:52 PM

NIMS Recruitment: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉన్న ఈ వైద్య సంస్థలో పలు ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, మెడికల్‌ అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అర్థోపెడిక్స్‌ విభాగాల్లో ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ 500082 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,68,900 జీతంగా చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: High BP: బీపీ ఎక్కువగా ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు.. చాలా ప్రమాదం..?

IPL 2022 Auction: ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు షాక్.. తప్పుకున్న ఆ జట్టు బ్యాటింగ్ కోచ్..

congress leader: పార్టీలో ఉన్నారా..? లేరా..? ఇంతకు ఆయనెవరు..? ఎందుకు దూరంగా ఉంటున్నారు..?