congress leader: పార్టీలో ఉన్నారా..? లేరా..? ఇంతకు ఆయనెవరు..? ఎందుకు దూరంగా ఉంటున్నారు..?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (Congress Party) లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే అంటారు. అదే పార్టీపై ధిక్కార స్వరం వినిపించేలా ఆయనను పురిగొల్పుతోందా..? పార్టీ సిద్ధాంతాలకు..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (Congress Party) లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే అంటారు. అదే పార్టీపై ధిక్కార స్వరం వినిపించేలా ఆయనను పురిగొల్పుతోందా..? పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఉసిగొల్పుతోందా..? మొన్నటి వరకు సొంత పార్టీ పైనే ఫైర్ అవుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడెక్కడ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్న పార్టీ మెంబర్‌షిప్ ప్రొగ్రాంలో ఎందుకు కనిపించడం లేదు. ఇంతకు ఎవరా నేత? ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇంతకు కాంగ్రెస్‌లో ఉన్నట్టా.. లేనట్టా.. ఇప్పుడిదే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా చేపట్టిన మెంబర్‌షిప్ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati reddy Rajagopal Reddy) కనిపించకపోవడం ఆసక్తి రేపుతోంది. ఒకానొక దశలో బీజేపీని పొడిగిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారమూ సాగింది. అంతేకాదు ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కమలం పార్టీ నుంచే పోటీ చేస్తారన్న వార్తలూ వచ్చాయి.
కానీ ఆ తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. కొద్దిరోజులు మౌనం పాటించిన ఆయన.. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త కార్యవర్గాన్ని వ్యతిరేకిస్తూ.. పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక పార్టీ మనుగడే లేకుండా పోవడంతో నేతలకు అధిష్ఠానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో చాలా మంది లీడర్లు పార్టీ ప్రోగ్రామంలో పాల్గొంటూనే.. మెంబర్‌షిప్‌లను చేయిస్తున్నారు. పార్లమెంటు వైజ్‌గా చూస్తే ఉత్తమ్ కుమార్‌రెడ్డి నెంబర్ వన్‌లో ఉండగా.. అసెంబ్లీ పరంగా ఇతర నాయకులు దూసుకుపోతున్నారు. మొదట్లో రేవంత్ ని వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు మెంబర్ షిప్ లోనూ ముందున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెంబర్ షిప్ అంశాన్ని మొదట్లో సీనియర్ నాయకులు పట్టించుకోలేదు. కానీ కొంత కాలం తర్వాత అధిష్ఠానం హెచ్చరికతో జగ్గారెడ్డి వంటి వారితో పాటు అసమ్మతి వర్గం నేతలంతా సరేనన్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. కానీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం.. అటు పార్టీ ప్రోగ్రాంలో కానీ, మెంబర్ షిప్‌ను చేయించడంలో కానీ కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. దీనికి సంబంధించి పీసీసీ సభ్యత్వ కార్యక్రమం అయ్యాక.. రాజగోపాల్ రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
Car Seat Belts: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక కార్లలో అన్ని సీట్లకూ బెల్ట్ ఉండాల్సిందే
పొలాల్లో నగ్నంగా పదేళ్ల బాలుడి మృతదేహం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Ram Gopal Varma: జగన్‌తో మెగా మీటింగ్ పై మరో ట్వీట్ వేసిన ఆర్జీవీ.. ఈ సారి ఇలా