Yadadri Temple: ఏడేండ్ల కష్టానికి ఫలితం.. మరికొన్ని రోజుల్లో పునః ప్రారంభం కానున్న యాదాద్రి ఆలయం
Yadadri Temple: తెలంగాణ(Telangana)లో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. దాదాపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి(Yadadri Lakshmi Narasimha Temple) ఆలయ పునర్నిర్మాణ పనులు..
Yadadri Temple: తెలంగాణ(Telangana)లో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. దాదాపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి(Yadadri Lakshmi Narasimha Temple) ఆలయ పునర్నిర్మాణ పనులు ఏడేళ్ల పాటు జరిగాయి. మరికొన్ని రోజుల్లో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. తెలంగాణ సర్కార్ స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఆలయానికి సంబంధించి 70ఎకరాల్లో యాగశాల నిర్మాణం జరుగుతోంది. పునః ప్రారంభ సమయం సమీపిస్తుండడంతో ..యాగశాల నిర్మాణపనులు శరవేగంగా చేస్తున్నారు. పనుల తీరుని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి పునఃప్రారంభోత్సవ పనులపై.. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ రివ్యూ చేస్తున్నారు.
మరోవైపు ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ధి చేస్తూ .. తెలంగాణాలో ప్రముఖ పర్యటక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్డుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో యదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించనున్నారు. ఈ మేరకు బంగారం విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు స్వామివారి దివ్య చరిత్రను త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చూపించనున్నారు. పంచనారసింహుడి చరిత్రను దృశ్య రూపకంలో తిలకించే విధంగా ఉత్తర రాజగోపురంపై త్రీడీ యానిమేషన్ మ్యాపింగ్ ద్వారా చూపించనున్నారు.
Also Read: