Statue of Equality: రేపు ముచ్చింతల్‌కు రానున్న రాష్ట్రపతి కోవింద్.. ఆదివారం మధ్యహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) హైదరాబాద్(Hyderabad)కు రానున్నారు. ముచ్చింతల్(Mucchinthal)లో జరుగుతున్న..
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) హైదరాబాద్(Hyderabad)కు రానున్నారు. ముచ్చింతల్(Mucchinthal)లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొననున్నారు. ముచ్చింతల్ లోని భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రామ్ నాథ్ కోవింద్ దాదాపు రెండుగంటల పాటు గడపనున్నారు.. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం రామానుజ చార్యుల (సమతా మూర్తి) భారీ విగ్రహాన్ని సందర్శించి, ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు.
రేపు (ఫిబ్రవరి 13వ తేదీ) మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి భద్రతా దృష్ట్యా ట్రాఫిక్ పై సైబాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం (ఫిబ్రవరి ) మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు భారీగా రావద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి సాయంత్రం హెలికాప్ట్టర్‌లో బయలుదేరి బేగంపేటకు, అక్కడ నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు.
Also Read: అనంతలో ఘనంగా గోవుకి సీమంతం వేడుక.. 500మందికి అన్నదానం చేసిన దంపతులు..