Telangana: యాదాద్రి వేదికగా BJPపై మరోసారి సమరశంఖం.. థర్డ్ ఫ్రంట్ దిశగానూ సంకేతాలు
మెంటల్ ఎక్కినట్లు ప్రవర్తిస్తున్న మోదీ సర్కారుని తరిమితరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు సీఎం. పనిలో పనిగా థర్డ్ ఫ్రంట్ దిశగానూ సంకేతాలిచ్చారు. కేంద్రంతో పోరాటానికి ఎంత వరకైనా వెళ్తానని ప్రకటించారు కేసీఆర్.
యాదాద్రి వేదికగా BJPపై మరోసారి సమరశంఖం పూరించారు ముఖ్యమంత్రి KCR. నేరుగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. మెంటల్ ఎక్కినట్లు ప్రవర్తిస్తున్న మోదీ సర్కారుని తరిమితరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు సీఎం. పనిలో పనిగా థర్డ్ ఫ్రంట్ దిశగానూ సంకేతాలిచ్చారు. కేంద్రంతో పోరాటానికి ఎంత వరకైనా వెళ్తానని ప్రకటించారు కేసీఆర్. మమతా బెనర్జీ మాట్లాడారని, ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం థాక్రే కూడా తనతో మాట్లాడారని చెప్పారు. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో బీజేపీ బాగోతాలు చెబుతానని చెప్పారు. ఏం రంగంలోనూ మోదీ ప్రభుత్వం సాధించిందేమీ లేదని ఆయన అన్నారు. వ్యవసాయం రంగానికి.. దళితులకు, గిరిజనులకు మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతులను ఏడాదిపాటు ఏడిపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చి పిచ్చి పాలసీలు తెస్తోందని కేసీఆర్ ఫైరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్ని నాశనం చేసిందని సీఎం విమర్శించారు. నీ సంగతి చూస్తాం అంటున్నారని.. ఏం చూస్తారు కేసీఆర్ సంగతి? అని ఆయన స్టైయిట్‌గా ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాగానే ప్రధాన మంత్రి సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి.. దేశానికి క్షమాపణలు చెప్పారని విమర్శించారు. రైతులను అవమానించారు. గుర్రాలతో తొక్కించారని పేర్కొన్నారు. ఇప్పుడు మెడమీద కత్తిపెట్టి విద్యుత్ మీటర్లు బిగించాలంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లు పెడితేనే డబ్బులు ఇస్తామని.. లేకుంటే లేదని చెబుతున్నారని ఆయన ఫైరయ్యారు. కేసీఆర్ చనిపోయినా మీటర్లు పెట్టేందుకు ఒప్పుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
Also Read: కేంద్రం అవినీతి చిట్టా అందింది.. పీఎం మోదీపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..