AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue Of Equality: ‘ప్రపంచంలోనే 8వ అద్భుతం’.. సమతా మూర్తిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

Statue Of Equality: శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహం ప్రపంచంలోనే 8వ అద్భుతం అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు.

Statue Of Equality: ‘ప్రపంచంలోనే 8వ అద్భుతం’.. సమతా మూర్తిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
Venkaiah Naidu
Shiva Prajapati
|

Updated on: Feb 12, 2022 | 9:25 PM

Share

Statue Of Equality: శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహం ప్రపంచంలోనే 8వ అద్భుతం అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. శనివారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానాజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం రామానుజాచార్యులను ఉద్దేశించి ప్రసంగించారు వెంకయ్య నాయుడు. వెయ్యేళ్ల కిందటే వివక్షలకు వ్యతిరేకంగా సానుకూల విప్లవానికి నాంది పలికిన రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించడం అదృష్టం అని పేర్కొన్నారు. సామాజిక సంస్కరణల అభిలాషి రామానుజాచార్యులు అని పేర్కొన్నారు. కులం కన్నా గుణం మిన్న అని ఆ రోజుల్లోనే చాటి చెప్పారని అన్నారు. ఆ మార్గంలో మనం అతా పయనించాల్సిన అవసరం ఉందని చెప్పారు ఉపరాష్ట్రపతి. గూగుల్ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరలేదన్నారు. గూగుల్‌కు ఇబ్బంది వస్తే గురువు రావాల్సిందేనని పేర్కొన్నారు. తల్లిదండ్రులను, గురువును, జన్మస్థలాన్ని, మాతృభాషను మరిచిపోకూడదని ప్రజలకు సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలంకరణ కన్నా అంతఃకరణ మిన్న అన్నది గుర్తించాలన్నారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటులో విశిష్ట కృషి చేసిన చినజీయర్ స్వామికి, జూపల్లి రామేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు ఉపరాష్ట్రపతి.

Also read:

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..

Eye Health: కళ్ల కింద క్యారీ బ్యాగులతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ టిప్స్‌ పాటించండి.. వెంటనే రిజల్ట్స్‌..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో పెన్షన్‌ పెరిగే అవకాశం..!