Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Speech Updates: కేంద్రం అవినీతి చిట్టా అందింది.. పీఎం మోదీపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..

CM KCR Speech at Yadadri: ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతోందంటూ

CM KCR Speech Updates: కేంద్రం అవినీతి చిట్టా అందింది.. పీఎం మోదీపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 12, 2022 | 5:48 PM

CM KCR Speech at Yadadri: ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతోందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఆ పిచ్చితోనే రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. చెత్త పాలసీలు తీసుకువచ్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రసంగం యధావిధిగా ఆయన మాటల్లోనే.. ‘‘మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది. మోదీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చింది. ఏడాది పాటు రైతులను ఏడిపించారు. రైతులను అవమానించారు, గుర్రాలతో తొక్కించారు. చివరకు రైతుల మీదకు కార్లు కూడా ఎక్కించారు. మోదీ ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించింది. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే డబ్బులిస్తాం, లేకుంటే ఇవ్వబోమంటోంది మోదీ ప్రభుత్వం. ప్రధాని మోదీని తరిమి తరిమి కొట్టాలి. మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్ని నాశనం చేసింది. ఏ రంగానికి న్యాయం చేయలేదు. మీ సంగతి చూస్తాం అంటున్నారు.. ఏం చూస్తారు కేసీఆర్ సంగతి?. నేను ఎవరికీ భయపడను. నేను భయపడితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణకు పెట్టుబడులు భారీగా ఎందుకు వస్తున్నాయి.? ఇక్కడి పాలనా విధానాలు చూసే పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. మతతత్వ బీజేపీ ఉంటే.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తారా? నరేంద్ర మోదీ సిగ్గుపడాలి.’’ అంటూ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్..

కర్నాటక వివాదంపై స్పందన.. ఇదే సమయంలో కర్నాకట వివాదంపైనా సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ‘‘కర్నాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా? సిలికాన్ వ్యాలీలో ఆడబిడ్డల మీద, విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి. విద్యార్థుల మధ్య మత కలహం పెడుతోంది బీజేపీ. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? మోదీ ఉజ్వలమైన పరిపాలనలో పరిశ్రమలు మూతపడటం నిజం కాదా? ఏ రంగానికి మేలు చేసింది బీజేపీ ప్రభుత్వం. దేశం ఎవరి అయ్య సొత్తు కాదు. కర్నాటకలో మత పిచ్చి లేపారు. దేశంలో సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ చేతకానితనం, తెలివి తక్కువతనంతో నీటి వనరులు సద్వినియోగం కావడం లేదు.’’ అని ధ్వజమెత్తారు.

ఆకలి చావులు పేరుతున్నాయి.. భారతదేశంలో ఆకలి చావులు పెరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ ఆకలి సూచీలో భారత్ స్థానం 101. మరి మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? మోదీ గొప్ప పాలనే అయి పవిత్ర గంగానదిలో శవాలు తేలుతాయా? కరోనా సమయంలో కోట్ల మంది వేల కిలోమీటర్లు రోడ్లపై నడిచారు.’’ అని ప్రశ్నించారు.

నీటి చుక్కనే కదా? ఎందుకు వణుకుతున్నారు?.. నరేంద్ర మోదీ ఎందుకు తెలంగాణతో తల గోక్కుంటున్నారు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మోదీ మనసులో ఏముందన్నారు. కేసీఆర్ నీటి చుక్క అయితే ఎందుకు గడగడ వణుకుతున్నారు? అని ప్రశ్నించారు. ‘‘నా ప్రాణం తెలంగాణ. నేను చచ్చినా సరే కేంద్రం కరెంట్ పాలసీలు తెలంగాణలో అమలు చేసేది లేదు.’’ అని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్.

కేంద్రం అవినీతి చిట్టా నా చేతిలో.. కేంద్ర ప్రభుత్వంలోని అవినీతి బాగోతాలు ఈ మధ్యనే నా దగ్గరికి వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంపై పోరుకు సిద్ధమని.. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ మాట్లాడారని చెప్పారు సీఎం కేసీఆర్.

అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘అస్సాం బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. మోదీ ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ భాష. అస్సాం సీఎం అలా దిగజారి మాట్లాడవచ్చా?. అహంకారమా? కళ్లు నెత్తికెక్కాయా? అస్సాం సీఎంను మోదీ బర్తరఫ్ చేయాలి. ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఇదా మన సంప్రదాయం. దీనిపై మోదీ, నడ్డా సమాధానం చెప్పాలి. సీఎం పదవి నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి.’’ అని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

తెలంగాణ అభివృద్ధిపై.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరింగ సభలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ పోరాటంలో భువనగిరి బెబ్బులిలా పాల్గొందన్నారు. భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం ఈ ప్రాంతం చాలా ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చాక కరెంట్ కష్టాలన్నీ తీరాయన్నారు. 24 గంటలూ అన్ని రంగాలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు. తలసరి కరెంట్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఇవాళే కలెక్టరేట్ ప్రారంభించుకున్నామన్న కేసీఆర్. మరికొద్ది రోజుల్లోనే కాళేశ్వరం జలాలు వస్తాయన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. అలాగే రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు అందుతున్నాయి. తెలంగాణ పోరాటంలో భువనగిరి బెబ్బుబిలా పాల్గొంది. రాయగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ. భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఈ జిల్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. సమైక రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి రైతబంధు ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఏడేళ్ల క్రితం భూముల ధర ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ ఉదహరించారు సీఎం కేసీఆర్.

Also read:

Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!

Andhra Pradesh: భర్తను చంపి గొడ్ల చావిడిలో పాతిపెట్టిన భార్య.. 3వ రోజు దుర్వాసన రావడంతో

NTR: ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లో పెరుగుతోన్న క్రేజ్‌.. నిన్న దీపికా పదుకొణె, నేడు పాయల్‌ ఘోష్‌..