Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!

Ishan Kishan Auction Price: వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషాన్ నక్క తోక తొక్కాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధర పలికాడు.

Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!
Ishan Kishan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 12, 2022 | 6:43 PM

Ishan Kishan Auction Price: వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ నక్క తోక తొక్కాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధర పలికాడు. ఏకంగా రూ.15.25 కోట్ల ధర పలికాడు. గత సీజన్‌లో అతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. కానీ అతన్ని ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవాలన్న నిబంధనతో అతన్ని రిటైన్ తీసుకోలేదు. మెగా వేలంలో అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ జట్టు తీవ్రంగా ప్రయత్నించింది. అతని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడినా ఇషాన్ కిషన్‌ను చివరికి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇషాన్ కిషన్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది.

ఇషాన్ కిషన్ కోసం మొదటగా ముంబై ఇండియన్స్ వేలం ప్రారంభించింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వేలానికి వచ్చింది. దీంతో వేలం వెంటనే ఆరు కోట్లకు చేరుకుంది. అప్పుడు గుజరాత్ టైటాన్స్ రూ.10 కోట్లకు వేలం పాడింది. అప్పుడే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రేసులోకి వచ్చింది. తీవ్ర పోటీ తర్వాత ఇషాన్ కిషన్ ముంబై తన సొంతం చేసుకుంది. 2016 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టును ఇషాన్ కిషన్ ఫైనల్‌కు చేర్చాడు.

2016 వేలంలో తొలిసారిగా గుజరాత్ లయన్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇషాన్‌ను 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అతను రెండేళ్లపాటు ఈ ఫ్రాంచైజీలో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2018 వేలంలో అతడిని ముంబై ఇండియన్స్ రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇషాన్ 2020 సీజన్‌లో ముంబై తరపున 14 మ్యాచ్‌లలో 57.33 సగటుతో 145.76 స్ట్రైక్ రేట్‌తో 516 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇషాన్ 30 సిక్సర్లు కొట్టాడు. అయితే, గత సీజన్ అతనికి అంతగా లేదు. 241 పరుగులు చేశాడు.

Read Also… Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!