IPL 2022 Auction: కనక వర్షం కురిపించిన మార్క్యూ ప్లేయర్‌లు.. జాక్‌పాట్ కొట్టిన జాబితాలో ఎవరున్నారంటే?

ఐపీఎల్ 2022 (IPL 2022) వేలం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులో జరుగుతున్న వేలంలో ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, కొందరికి భారీ బిడ్లు కూడా దాఖలయ్యాయి.

IPL 2022 Auction: కనక వర్షం కురిపించిన మార్క్యూ ప్లేయర్‌లు.. జాక్‌పాట్ కొట్టిన జాబితాలో ఎవరున్నారంటే?
Ipl Auction 2022 Marquee Players
Follow us

|

Updated on: Feb 12, 2022 | 4:13 PM

ఐపీఎల్ 2022 (IPL 2022) వేలం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులో జరుగుతున్న వేలంలో ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, కొందరికి భారీ బిడ్లు కూడా దాఖలయ్యాయి. 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న మార్క్యూ ప్లేయర్ల వేలంతో ప్రారంభమైన ఈ వేలం.. ఏడుగురికి భారీ ప్రమోషన్ లభించింది. ఈ ఆటగాళ్లపై చాలా జట్లు ఆసక్తి కనబరిచాయి. భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మార్క్యూ ప్లేయర్‌లలో అత్యంత ఖరీదైన వ్యక్తిగా నిలిచాడు. అతడితో పాటు ఆటగాళ్లకు కూడా భారీ మొత్తమే దక్కింది.

ముందుగా వేలం వేసిన మార్క్యూ ప్లేయర్లలలో అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన వారున్నారు. చాలా జట్లు వారిని కొనుగోలు చేయాలనుకున్నాయి. ఈసారి భారత్‌కు చెందిన శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్, క్వింటన్ డి కాక్, గిసో రబాడ, ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్‌లతో సహా 10 మంది ఆటగాళ్లను మార్క్యూ ప్లేయర్‌లుగా ఎంపిక చేశారు.

ఈ ఆటగాళ్లు లాభపడ్డారు..

శ్రేయాస్ అయ్యర్ – రూ. 12.25 కోట్లు (KKR).. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు భారీ బిడ్ వస్తుందని ముందునుంచి భావించిన సంగతి తెలిసిందే. గతేడాది ఢిల్లీ జట్టు అతడిని రూ.7 కోట్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు చేర్చుకుంది. దీంతో అయ్యర్‌కి భారీ ప్రయోజనం చేకూరింది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగాను ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

కగిసో రబడ – రూ. 9.25 కోట్లు (PBKS).. కగిసో రబాడను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను గత కొన్ని సీజన్‌లుగా బాగా రాణిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం అతడిని పంజాబ్ కింగ్స్ దాదాపు రెట్టింపు ధరకు కొనుగోలు చేసింది. రూ. 9.25 కోట్లకు రబాడను తనతో చేర్చుకుంది.

శిఖర్ ధావన్ – రూ. 8.25 కోట్లు (PBKS).. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన శిఖర్ ధావన్‌కు కూడా భారీ ప్రయోజనం దక్కింది. ఈసారి రూ.5.2 కోట్లకు కొనుగోలు చేశారు.

ట్రెంట్ బౌల్ట్ – రూ. 8 కోట్లు (RR).. ట్రెంట్ బౌల్ట్ గత కొన్ని సీజన్‌లుగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గతంలో ఎంఐ రూ. 3.2 కోట్లకు చేర్చుకుంది. అయితే ఈసారి మాత్రం భారీ పోటీ రావడంతో రాజస్థాన్ రాయల్స్ టీం రూ.3.2 కోట్లకు జట్టులోకి తీసుకుంది.

ఫాఫ్ డు ప్లెసిస్ – రూ.7 కోట్లు (RCB).. చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నమ్మకమైన ఫాఫ్ డు ప్లెసిస్ ఈసారి ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడు. ప్రస్తుతం అతను RCB తరపున ఆడబోతున్నాడు. ఈ ఆటగాడిని గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రూ. 1.6 కోట్లకు దక్కించుకోగా, ఈ ఏడాది మాత్రం ఆర్‌సీబీ భారీ ధరతో దక్కించుకుంది.

క్వింటన్ డి కాక్ – రూ. 6.75 కోట్లు (LSG).. ఈ వేలంలో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్‌కు కూడా భారీ ప్రయోజనం లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతన్ని రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై తరపున కేవలం రూ. 2.8 కోట్లు మాత్రమే పొందిన డికాక్.. భారీ లాభంతో లక్నో టీంలో చేరాడు.

మహ్మద్ షమీ – రూ. 6.25 కోట్లు (GT).. పంజాబ్ కింగ్స్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకడు. అతన్ని జట్టు గతేదాడి రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత వేలంలో రూ.6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

Also Read: LSG IPL 2022 Auction: ఈ ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.. KL రాహుల్‌తోపాటు ఎవరున్నారో తెలుసుకోండి..

IPL Auction 2022: మిస్టర్ ఐపీఎల్‌కు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. అమ్ముడుపోని లిస్టులో ఎవరున్నారంటే?

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో