Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka hijab row: రాజకీయ చదరంగంలో పావులుగా మారుతున్న విద్యాక్షేత్రాలు

Karnataka hijab row: కళాశాల లోపల ముస్లిం విద్యార్థులు హిజబ్ ధరించటం యూనీఫారం రూల్స్ కు వ్యతిరేకమంటూ కర్ణాటకలోని ఒక కాలేజి యాజమాన్యం అక్కడ చదవుతున్న ముస్లిం విద్యార్థినులకు ఉన్న అసలు సమస్య..

Karnataka hijab row: రాజకీయ చదరంగంలో పావులుగా మారుతున్న విద్యాక్షేత్రాలు
Karnataka Hijab Row
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 12, 2022 | 8:30 PM

Karnataka hijab row: కళాశాల లోపల ముస్లిం విద్యార్థులు హిజబ్ ధరించటం యూనీఫారం రూల్స్ కు వ్యతిరేకమంటూ కర్ణాటకలోని ఒక కాలేజి యాజమాన్యం అక్కడ చదవుతున్న ముస్లిం విద్యార్థినులకు ఉన్న అసలు సమస్య. భారత రాజ్యాంగం ప్రకారం హిజబ్ ధరించటం తమ హక్కని విద్యార్థినులు నినదించారు. దీంతో కాలేజీలోని హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలతో తమ గుర్తింపుకోసం రంగప్రవేశం చేశారు. ఇది కాస్తా చిలికి చిలికి పెద్దదై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేంత స్థాయికి చేరింది. దీనికి తరువాత రాజకీయ రంగు పులమటంతో చాలా పెద్ద వివాదంగా మారి.. చివరికి కర్ణాటక హై కోర్టు వరకు వెళ్లింది. యూవిఫారం విషయంపై జరుగుతున్న అనవసరమైన చర్చ వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం లేదు. దీనిని చూస్తుంటే విద్యాబుద్ధులు నేర్పే ప్రదేశాలు కాస్తా ద్వేష భావాన్ని పెంపొందించటానికి కేంద్రాలుగా మారుతున్నాయి.

వివాదాన్ని ఎవరెలా చూస్తున్నారంటే..

అసలు ఈ వివాదంలో జరుగుతున్న చర్చలను మనం చూస్తే.. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ మేరకు విద్యాసంస్థలు లాంటి ప్రదేశాల్లో వస్త్రధారణపై న్యూట్రాలిటీ పాటించడం మంచిదనేది ఓ ప్రతిపాదన. మరికొందరి వాదన ఏంటంటే విద్యాసంస్థల్లో యూనిఫారం సమానత్వానికి చిహ్నంగా తీసుకొచ్చారు కాబట్టి.. హిజబ్ దానికి విరుద్దమైనదని అంటున్నారు. మరికొందరికి మాత్రం ఈ వివాదం మైనారిటీ ముస్లిం విద్యార్థినుల విద్య పట్ల జరుగుతున్న గొడవగా భావిస్తున్నారు. భారత్ లాంటి దేశంలో మత ఆచారాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలు ఈ వివాదంలో అనేక మంది లేవనెత్తుతున్న అసలు అంశం ఏంటంటే ఇటువంటి వాతావరణంలో విద్యార్థులు వేటిని నేర్చుకుంటారని. విద్యకు కేంద్రంగా ఉండాల్సిన చోట్ల వివాదాలు రావడం.. ఇంతకుముందు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది అందరినీ ఆలోజిపచేస్తోంది. ఇంతకు ముందు దేశంలో ఇటువంటి వివిదాలు వచ్చినా అవి విజయవంతంగా సరిచేయబడ్డాయి. చాలా కాలం కిందట ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించేవారు కాదు. అరుదుగా కొంతమంది మాత్రం తరగతిగదుల్లో సైతం ధరించేవారు. అలాగే అబ్బాయిలు సైతం దోతీ సల్వార్ ధరించేవారు. బొట్టు పెట్టుకునేవారు. అప్పట్లో వారు సరస్వతి పూజ, మెుహరం వంటివి కలిసి చేసుకునేవారు. విద్యార్థి లోకంలో వారికి వేషధారణ అవేది పెద్దగా ప్రాధాన్యం లేనిది. 1990 కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఎటువంటి భేదభావాలు చూపేవారు కాదు.

కానీ.. కొంతమంది మతాలకు సంబంధించి గ్రూపులుగా విడిపోవడం.. వారికి గుర్తింపు కావాలని చేస్తున్న కొన్ని పనుల వల్ల వివాదాలు వస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు చీర కట్టు వ్యత్యాసం ఉన్నట్లే.. ముస్లింలకు సైతం వారి వస్త్రధారణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న గుర్తింపులను ధృవీకరించడం వల్ల భారతదేశంలో విద్యావంతులైన జనాభాలో అసహనం పెరుగుతోంది. నేడు మనం చాలా ఆరోగ్యకరమైన రీతిలో సహజీవనం సాధ్యం చేసిన లక్షణం వేగంగా కనుమరుగవుతోంది.

భాష, హక్కులు, రాజ్యాంగం, స్వేచ్ఛ మొదలైన వాటితో ముడిపడి ఉన్న గుర్తింపుల చుట్టూ ఉన్న రాజకీయాలు స్థానిక స్థాయిలో సమస్యను పరిష్కరించడం కంటే లోతైన సంఘర్షణను రేకెత్తిస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి, సమస్య ఎక్కడ నుండి వస్తుంది?. మతాల చుట్టూ అవకాశవాద రాజకీయాలను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తింపు కోసం వివిధ మతాల వారు చేస్తున్న ప్రయత్నాలు చాలా సమస్యలకు కారణంగా మారుతున్నాయి. ఇస్లామిజం స్థాపన అంటూ కొన్ని ముస్లిం గ్రూపులు ప్రచారం చేయటం ఈ సమస్యలకు కొంతవరకు కారణంగా మారుతోంది. వివిధ మతాలు, కులాలు, ఆచారాలు ఉన్న అఖండ భారతంలో మన పూర్వీకులు కలిసి మెలిసి జీవించిన విధానాన్ని వారు ప్రస్తుత తరానికి అందించారు. వాటిని అందిపుచ్చుకుంటూ జ్ఞానానికి కేంద్రాలైన విద్యాలయాలను రాజకీయాలకు, గొడవలకు, వివాదాలకు దూరంగా ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిని ఇప్పుడు సరిద్ధకపోతే విద్యాలయాలు యుద్ధక్షేత్రాలుగా మారే ప్రమాదం పొంచిఉంది.

ఇవీ చదవండి..

Rakesh Jhunjhunwala: ఒక్కరోజే రూ. 426 కోట్లు కోల్పోయిన బిగ్ బుల్.. ఏ కంపెనీల్లో అంటే..

Mukesh Ambani: తగ్గేదే లే.. ఆ రంగంలో ముకేశ్ అంబానీ భారీ పెట్టుబడులు.. పూర్తి వివరాలు..

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి నచ్చిన పాట.. ఆయన నోటే వినండి.. దానికి అర్థమేంటో తెలుసుకోండి..