06 December 2025

ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టిన త్రిష.. 42 ఏళ్ల వయసులో ఆ పని చేస్తుందట..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది చిత్రపరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. ఇప్పుడు 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ ఫిట్‌నెస్, లుక్స్ విషయంలో కుర్రహీరోయిన్లుకు పోటీ ఇస్తుంది. తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ బయటపెట్టింది.

నిద్ర లేచిన వెంటనే ఆమె ఒక గంట సేపు కార్డియోతో పాటు వ్యాయామం కూడా చేస్తుంది. పండ్లు కూరగాయలు తీసుకుంటానని, నీళ్లు ఎక్కువగా తాగుతానని చెబుతుంది

ప్రతి రాత్రి డిన్నర్ త్వరగా పూర్తి చేయడమే కాకుండా దాదాపు 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోతుందట. హైడ్రేట్ గా ఉండేందుకు కావాల్సిన డైట్ ఫాలో అవుతుంది.

వ్యాయామంతో పాటు ప్రతిరోజూ యోగా చేయడం కూడా తప్పనిసరి అని అంటుంది ఈ భామ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ యోగా, వ్యాయామం స్కిప్ చేయనంటుంది.

అలాగే త్రిష స్విమ్మింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి ఆక్టివిటీస్ కూడా తనకి చాలా ఇష్టం అని చెబుతోంది త్రిష. ప్రతిరోజు వీటిని చేయడం వల్లే శరీరంలో యాక్టివ్ గా ఉంటుందట.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.