తెలుగులో ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘జాతి రత్నాలు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.
ఫస్ట్ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఆ తర్వాత మత్తు వదలరా 2 సినిమాతోపాటు పలు చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఛాన్స్ వస్తే ఎవరితో డేటింగ్ చేస్తారు.. ? ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది.
తనకు ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేస్తానని చెబుతుంది. అంతేకాదు ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాని చెప్పి అందరిని ఆశ్యర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం తెలుగులో క్రేజీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ మూవీ హిట్టైనప్పటికీ తర్వాత ఆ స్థాయిలో మరో విజయాన్ని అందుకోలేకపోయింది.
అలాగే మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంటుంది. ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో సరైన బ్రేక్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తుంది.