AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచాయతీ ఎన్నికల బరిలో 95 ఏళ్ల నవ యువకుడు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా యువకులు పోటీ చేస్తున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది చెబుతున్నారు కూడా.. కానీ 95 ఏళ్ల వ్యక్తి మాత్రం.. తాను యువతతో పాటు పోటీపడతా అంటూ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో యువతను ఢీ కొట్టేందుకు 95 ఏళ్ల నవ యువకుడు బరిలోకి దిగాడు. ఆ నవ యువకుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పంచాయతీ ఎన్నికల బరిలో 95 ఏళ్ల నవ యువకుడు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
Ramachandra Reddy
M Revan Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 06, 2025 | 3:35 PM

Share

తెలంగాణలో ఎక్కడ చూసినా గ్రామ సర్పంచ్ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ అయింది. ఈ గ్రామానికి చెందిన 95 ఏళ్ల గుంటకండ్ల రామ చంద్రారెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామ చంద్రారెడ్డి. రాష్ట్రంలో అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్ పదవి అభ్యర్ధిగా రికార్డులకు ఎక్కారు. యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో.. తనకు వయసుతో సంబంధం లేదని, యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా నేను పనిచేస్తానని 95 ఏళ్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.. వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని అంటున్నారు. ఆది నుంచి సామాజిక సేవ చేసే నేపథ్యం కలిగిన కుటుంబమని పేర్కొన్నారు. ఈ వయసులో కూడా చాలా చక్కగా, తన పని తాను చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు.. ప్రజా సేవ చేయాలనే తపన ఉందని.. అందుకే.. గ్రామాభివృద్ది కోసం.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

గ్రామంలో తొలి ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి భవనాలను రామచంద్రారెడ్డి కుటుంబీకులే నిర్మించారు. గ్రామస్తులతో రామచంద్రారెడ్డి. రైతుగా, టీచరుగా.. వైద్యుడిగా గ్రామస్తులతో మమేకమయ్యారు. అనేక సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టారు.. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ… ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు ఎన్నికలకు వెళ్తున్నానని రామచంద్రారెడ్డి చెబుతున్నారు.. సతీమణి సుశీల ఫౌండేషన్ తరపున గ్రామంలో అనేక కార్యక్రమాలను చేపట్టారని.. గ్రామాభివృద్ధిలో రామచంద్రారెడ్డి కీలక పాత్ర ఉందని, ఇక ఎన్నిక లాంఛనమేనని గ్రామస్తులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం