Priyamani: నటిగా నాకింకా ఆకలి తీరలేదు!.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది హీరోయిన్ ప్రియమణి (Priyamani). యమదొంగ, పెళ్లైన కొత్తలో వంటి చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Priyamani: నటిగా నాకింకా ఆకలి తీరలేదు!.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..
Priyamani New Photos. Credit by:Priyamani/Instagram
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 12, 2022 | 6:37 PM

అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది హీరోయిన్ ప్రియమణి (Priyamani). యమదొంగ, పెళ్లైన కొత్తలో వంటి చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రియమణి.. ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. ఓవైపు వెండితెరపై రాణిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై కూడా సత్తా చాటుతోంది. టీవీలలో పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ రాణిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‏తో ఓటీటీలోకి అడుగుపెట్టిన ప్రియమణి ఇప్పుడు తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో మరో కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ భామ కలాపం చేస్తుంది. ఆహాలో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న భామ కలాపం సీరిస్‏కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

”నటిగా నాకింకా ఆకలి తీరలేదు. ఇంకా చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫుల్‌ లెంగ్త్ నెగటివ్‌ రోల్‌ చేయాలని ఉంది. ఇప్పటికే కొంతమంది నాకు కథలు వినిపించారు. వినగానే నచ్చితే కచ్చితంగా చేస్తాను” అని అన్నారు ప్రియమణి. ఆమె నటించిన ‘భామా కలాపం’ ఆహాలో ఇటీవల విడుదలైంది. ఈ సినిమా గురించి, తన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడారు ప్రియమణి.

పాజిటివ్‌గా..! ‘భామా కలాపం’ చూశాక నాకు 100కి 200 శాతం శాటిస్‌ఫేక్షన్‌ కలిగింది. చూసిన వారందరూ చాలా బావుందని మెసేజ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ పాజిటివ్‌ రిప్లైలు ఇస్తున్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే బాగా నచ్చింది. దర్శకుడు నాకు ఎలా చెప్పారో అలాగే తీశారు. ఈ సినిమాలో నా పోర్షన్‌ నచ్చింది. లుక్‌ బావుంది. ఫీల్‌ బావుంది. నేను ఇంతకు ముందు ఎప్పుడూ మిడిల్‌ క్లాస్‌ హౌస్‌ వైఫ్‌గా నటించలేదు. అందుకే కొత్తగా అనిపించి చేశాను. గుడ్డు మీద సినిమా అంతా తిరుగుతుందని దర్శకుడు చెప్పగానే చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అసలు గుడ్డు గురించి ఇంత కథ నడపడం చాలా బాగా అనిపించింది. అసలు ఇలాంటి ఎగ్స్ రియల్‌ లైఫ్‌లో ఉంటాయని నేను అనుకోవట్లేదు. భామా కలాపం సినిమాలో అనుపమ నా హార్ట్ కి క్లోజ్‌గా ఉంటే కేరక్టర్‌ కాదు. నాకు కొత్తగా అనిపించే చేశా. నా నమ్మకం నిజమైంది. భామాకలాపం సినిమాను రెండు, మూడు సార్లు చూశామని చెప్పిన వారు కూడా ఉన్నారు.

అమ్మో.. కష్టం!.. ఈ సినిమా చేసేటప్పుడు అనుపమ కేరక్టర్‌ కోసం అంత అమాయకంగా కనిపించడం చాలా కష్టంగా అనిపించింది. స్క్రీన్‌ మీద బోల్డ్ గా, స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా కనిపించడం ఈజీ. కానీ అమాయకంగా కనిపించడం చాలా కష్టం. అందుకోసం కొంచెం ప్రాక్టీస్‌ చేశా. మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిలు, లేడీస్‌ ఇంట్లో ఎలా ఉంటారో కనుక్కున్నా. వాళ్లని మనసులో పెట్టుకుని చేశా. నిజానికి పక్కవాళ్ల జీవితాల్లో ఇంటర్‌ఫియర్‌ అయ్యే అలవాటు నాకెప్పుడూ లేదు. ఇప్పటిదాకా నా నైబర్‌ ఎవరో నాకు తెలియదు. కానీ, ఎవరైనా నన్ను సలహాలు అడిగితే ఇస్తాను. అంతవరకే కానీ, అవతలివాళ్ల జీవితాల్లోకి తొంగిచూడాలని అనుకోను.

వంట రాదు.. నాకు వంట చేయడం రాదు. మా ఆయన వంట చేస్తాడు. వంట రూములోకి వెళ్లి ప్రయోగాలు చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పటిదాకా ఆయనెప్పుడూ నన్ను ఇది చేసి పెట్టు అని అడగలేదు. నాకు హోమ్‌ ఫుడ్‌ ఇష్టం. ఏదైనా ప్రేమతో చేసిపెడితే తింటాను. చీరల్లో చాలా బావున్నావు. కామిక్‌ రోల్‌కి నువ్వు సూట్‌ అయ్యావు. ఇంకా అలాంటి రోల్స్ వస్తే చేయి అని మా ఆయన అన్నారు. యుఎస్‌లో ఉన్న ఆయన ఆహా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని భామా కలాపం చూశారు.

నెక్స్ట్ అదే!.. విరాటపర్వం సినిమాలో భరతక్క అనే కేరక్టర్‌ చేశా. రానా డిప్యూటీగా చేశా. రానా కేరక్టర్‌తో ట్రావెల్‌ చేసే పాత్ర అది. చాలా స్పెషల్‌ రోల్‌. డబ్బింగ్‌ అంతా అయిపోయింది. ఆల్రెడీ చేసిన నారప్పగానీ, రిలీజ్‌ కావాల్సిన విరాటపర్వంగానీ… ఏదైనా డిఫరెంట్‌గా ఉంటేనే ఓకే చెప్తున్నా. నా వరకు వచ్చిన కథల్లో బాగా నచ్చిన వాటినే సెలక్ట్ చేసుకుంటున్నా. నార్త్ లో చేస్తున్న మైదాన్‌, కన్నడలో డాక్టర్‌ 56 , తమిళ్‌లో కొటేషన్‌ గ్యాంగ్‌… ఇలా అప్‌కమింగ్‌ మూవీస్‌ అన్నిటిలోనూ నా కేరక్టర్లు చాలా బావుంటాయి. ఫ్యామిలీమేన్‌3 కూడా ఉంది.

పట్టించుకోను.. నేనెప్పుడూ దర్శకుల పనిలో వేలు పెట్టను. వాళ్లు నాకు సీన్‌ చెప్పినప్పుడు… క్రియేటివ్‌గా హోల్‌ సీన్‌ ఎలా ఉందో చూస్తాను. నాకు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్తాను. లేకుంటే అసలు నోరు తెరవను. డైరక్టర్‌ చెప్పిన మాటకు ఓకే అంటానంతే. – నేను యాక్టర్‌గా శాటిస్‌ఫై కాలేదు. ఫుల్‌ లెంగ్త్ విలన్‌ రోల్‌ చేయాలని ఉంది. ఇప్పటిదాకా అలాంటిది రాలేదు. ఇప్పుడిప్పుడే కథలు వస్తున్నాయి. కానీ ఇంకా మంచిది వస్తే తప్పకుండా చేస్తా.

ఓటీటీ ఉపయోగాలు.. ఓటీటీలు వచ్చాక విమెన్‌ ఓరియంటెడ్‌ కంటెంట్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లో అబ్బాయిలకు కూడా చాలా వెరైటీ రోల్స్ వస్తున్నాయి. ఓటీటీ వల్ల చాలా అడ్వాంటేజ్‌లున్నాయి. సీరీస్‌గానీ, సినిమాలుగానీ చూడొచ్చు. కావాలనిపిస్తే రివైండ్‌ చేసి చూడొచ్చు. థియేట్రికల్‌ ఎక్స్ పీరియన్సే వేరు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో ఓటీటీలు బెస్ట్ డెసిషన్‌. కరోనా పూర్తిగా నయం కావాలి. పరిస్థితిలో మార్పు రావాలి. అప్పుడు థియేటర్లు మళ్లీ కళకళలాడుతాయి.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రాన్ని వదలని పైరసీ బెడద.. ఒక్కరోజు ముందుగానే కళావతి సాంగ్ లీక్..

Priya Prakash Varrier: కచా బాదం పాటకు స్టెప్పులేసిన ప్రియా ప్రకాష్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో..

Throwback Pic: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? గ్లామర్ షోకు దూరంగా జూనియర్ సౌందర్యగా..

Manchu Lakshmi: ఎట్టకేలకు నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఈరోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!