Rowdy Boys: ఓటీటీలో అడుగుపెట్టనున్న రౌడీ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ (Ashish) హీరోగా వెండితెరకు పరిచయమైన చిత్రం 'రౌడీ బాయ్స్' (Rowdy Boys).
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ (Ashish) హీరోగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys). మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ‘హుషారు’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌ను తెరకెక్కించిన శ్రీహర్ష కనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాలేజ్‌లవ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పటిలాగే అనుపమ తన అందం, అభినయంతో ఆకట్టుకోగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు ఆశిష్. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన బాణీలు ఆకట్టుకున్నాయి.
కాగా థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘రౌడీబాయ్స్’ డిజిటల్ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 లో మార్చి 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, కార్తిక్ రత్నం, తేజ్ కురపాటి తదితరులు నటించారు.
Deepika Padukone: టాలీవుడ్‌లో ఆ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకోవాలనుంది.. దీపిక ఆసక్తికర వ్యాఖ్యలు..