Shaktimaan: సిల్వర్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోన్న ‘శక్తిమాన్‌’.. సూపర్‌ హీరో పాత్రలో ఎవరు నటించనున్నారంటే..

శక్తిమాన్‌ (Shaktimaan).. దాదాపు రెండు దశాబ్దాల క్రితం డీడీ నేషనల్‌లో ప్రసారమైన ఈ ధారావాహిక చిన్నారులను అమితంగా ఆకట్టుకుంది.

Shaktimaan: సిల్వర్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోన్న 'శక్తిమాన్‌'.. సూపర్‌ హీరో పాత్రలో ఎవరు నటించనున్నారంటే..
Shaktimaan
Follow us
Basha Shek

|

Updated on: Feb 12, 2022 | 9:16 AM

శక్తిమాన్‌ (Shaktimaan).. దాదాపు రెండు దశాబ్దాల క్రితం డీడీ నేషనల్‌లో ప్రసారమైన ఈ ధారావాహిక చిన్నారులను అమితంగా ఆకట్టుకుంది. ఆదివారం వచ్చిదంటే చాలు.. చాలామంది ఈ సూపర్‌ హీరో సీరియల్‌ కోసం టీవీకి అతుక్కుపోయేవాళ్లు. 1997 నుంచి 2005 వరకు సుమారు ఎనిమిదేళ్ల పాటు అలరించింది ఈ సీరియల్‌. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా (Mukesh Khanna) ‘శక్తిమాన్‌’ పాత్రను పోషించి మెప్పించాడు. అప్పట్లో ఈ సూపర్‌ హీరో గెటప్‌, వేషధారణ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ‘శక్తిమాన్‌’ పాత్ర ఫొటోలను వాడుకున్నాయి. ఇలా ఇండియన్‌ ఫస్ట్‌ సూపర్‌ హీరో క్యారెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘శక్తిమాన్‌’ మళ్లీ మన ముందుకు వస్తున్నాడు.

మన దేశీ సూపర్‌ హీరోకి టైమ్‌ వచ్చింది..

కాగా ఈ సూపర్ హీరో కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నటుడు ముఖేశ్ ఖన్నా 2020లోనే ప్రకటించారు. ఇప్పుడది కార్యరూపం దాల్చనుంది. తాజాగా ‘శక్తిమాన్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు ఓ ప్రమోషనల్‌ వీడియోను కూడా విడుదల చేసింది. ‘ ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు సూపర్ హీరో సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు మన దేశీ సూపర్ హీరోకి టైమ్ వచ్చింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ‘శక్తిమాన్’ని సిల్వర్‌ స్ర్కీన్‌పైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముఖేష్ ఖన్నాకి చెందిన భీష్మ్ ఇంటర్నేషనల్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. ‘శక్తిమాన్’ సినిమా కోసం సిద్ధంగా ఉండండి. మరిన్ని వివరాలు త్వరలో చెబుతాం’ అంటూ ట్వీట్‌ చేసింది. కాగా ఈ పోస్ట్‌ చూసిన ‘శక్తిమాన్‌’ అభిమానులు.. ‘ నేను ఎంతో ఆతృతగా ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ తమ ఎగ్జయిట్‌మెంట్‌ని తెలుపుతున్నారు. కాగా సిల్వర్‌ స్ర్కీన్‌పై శక్తిమాన్‌ క్యారెక్టర్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా.. వీరిలో ఒకరు నటించనున్నారన్న ప్రచారం సాగుతోంది.

Also Read:Deepika Padukone: టాలీవుడ్‌లో ఆ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలనుంది.. దీపిక ఆసక్తికర వ్యాఖ్యలు..

Pushpa: అసలు తగ్గేదేలే అంటోన్న పుష్ప.. బన్నీ, రష్మిక ఫొటోలతో చీరలు.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Actor Vishal: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్.. కేరళలో చికిత్స..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్