Actor Vishal: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్.. కేరళలో చికిత్స..

హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. విశాల్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి

Actor Vishal: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్.. కేరళలో చికిత్స..
Vishal
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2022 | 10:24 AM

Actor Vishal: హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. విశాల్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే ఎనిమి , సామాన్యుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. ఈ రెండు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టాడు విశాల్. ప్రస్తుతం లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు విశాల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు విశాల్. ఈసినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు విశాల్. ఈవిషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ప్రస్తుతం విశాల్ కేరళలో చికిత్స పొందుతున్నారు. లాఠీ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. విలన్స్ దగ్గర నుంచి ఓ బాబును కాపాడే సన్నివేశంలో విశాల్.. గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో విశాల్ చేతికి, నుదిటి భాగంలో గాయమైంది. వినోద్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సునయన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. విశాల్ కు గాయం కావడంతో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు చిత్రయూనిట్. తిరిగి మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా చివరి షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..