AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: అసలు తగ్గేదేలే అంటోన్న పుష్ప.. బన్నీ, రష్మిక ఫొటోలతో చీరలు.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ తో సందడి చేసింది

Pushpa: అసలు తగ్గేదేలే అంటోన్న పుష్ప.. బన్నీ, రష్మిక ఫొటోలతో చీరలు.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Pushpa
Basha Shek
|

Updated on: Feb 12, 2022 | 8:11 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ తో సందడి చేసింది. అనసూయ, సునీల్‌, ఫాహద్‌ పాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పాన్‌ ఇండియా చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. సినిమాలోని డైలాగులు, పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. ఇలా అన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈక్రమంలో పుష్ప క్యారెక్టర్‌ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాల ప్రముఖులు వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌… ఇలా ఎక్కడ చూసినా పుష్ప క్రేజే కనిపిస్తోంది. చివరకు బన్నీ సినిమా పేరుతో చిప్స్‌ ప్యాకెట్‌ కూడా వచ్చాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్‌గా మారింది. అదేంటంటే..

రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి..

కాగా అందమైన చీరలను తయారుచేయడంలో గుజరాత్‌ లోని సూరత్‌ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈనేపథ్యంలో స్థానికంగా ఉండే చరణ్‌జీత్‌ క్లాత్‌ మార్కెట్‌ ఏకంగా పుష్ప సినిమా పోస్టర్లతో చీరలు తయారుచేసింది. బన్నీ, రష్మిక మందాన పోస్టర్లను చీరలపై ముద్రించి అమ్మకానికి పెట్టాడు. అనంతరం దీనికి సంబంధిచిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అవి కాస్తా వైరల్‌ గా మారాయి. ఈ సందర్భంగా క్లాత్‌ కంపెనీ యజమాని చరణ్‌పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయింది. అందుకే ఈ సినిమా పోస్టర్లతో మొదట కొన్ని చీరలను మాత్రమే ప్రత్యేకంగా తయారుచేశాను. అయితే సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ కావడంతో చాలామంది వస్త్ర వ్యాపారుల నుంచి ఆర్డర్లు వచ్చాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ చీరల కోసం ఆర్డర్లు వస్తున్నాయి’ అని చెప్పుకొచ్చాడు.

.