Horoscope Today: ఈరోజు ఈరాశి వారు శుభవార్త వింటారు .. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే వృత్తి , ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఆరోజు ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తారు
Horoscope Today : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే వృత్తి , ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఆరోజు ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తారు. ఏ సమయంలో ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే దానిపై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో దినఫలాలు(Horoscope) తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 12వ తేదీ ) రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేషం
నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టదేవతలను ప్రార్థిస్తే రోజు భేషుగ్గా ఉంటుంది.
వృషభం
శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, స్నేహితులు సహకారం అందుతుంది. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శివారాధన చేస్తే మేలు చేకూరుతుంది.
మిథునం
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఇన్ని రోజుల పాటు అనుకూలంగా ఉన్న వాళ్లు ఒక్కసారి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. గణపతి సహస్రనామ పారాయణం శుభప్రదం.
సింహం
ఈరాశివారు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచి కలుగుతుంది.
కన్య
నా అనుకున్న వాళ్లు సమయానికి సాయపడతారు. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. లింగాష్టకం పఠిస్తే మంచిది.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులున్నాయి. నూతన వస్తువులను కొనేవారికి, మంచి పనులు ప్రారంభించేవారికి అనుకూల సమయం. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం
ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సంకల్పసిద్ధి ఉన్నా కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. అంజనేయుడిని దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.
ధనుస్సు
ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
మకరం
తొందర పాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించేవారికి అనుకూల సమయం. భవిష్యత్ ప్రణాళికలకు మంచి సమయం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వరుడిని దర్శించుకుంటే మంచి ఫలితాలు అందుకుంటారు.
కుంభం
ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. సూర్య భగవానుడిని ఆరాధిస్తే మంచి కలుగుతుంది.
మీనం
ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలక్ష్యాన్ని దరిచేరనీయకండి. శివధ్యానం శుభప్రదం.
Antarvedi: వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం.. వీడియో..