AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Special 2022: ఈ ఏడాది వాలెంటైన్ డే 4 రాశుల వారికి స్పెషల్ గిఫ్ట్స్ తీసుకురాబోతుందట.. అందులో మీరున్నారా..

Valentine Special 2022: ప్రేమికుల రోజు(Lovers Day) అంటే లవర్స్ కు ఎప్పుడూ ఇష్టమే. ఇక ఒక వారం రోజుల ముందు నుంచే అంటే ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ (Valentine Week) ప్రారంభమవుతుంది. రోజ్ డే నుంచే..

Valentine Special 2022: ఈ ఏడాది వాలెంటైన్ డే 4 రాశుల వారికి స్పెషల్ గిఫ్ట్స్ తీసుకురాబోతుందట.. అందులో మీరున్నారా..
Valentine Special 2022
Surya Kala
|

Updated on: Feb 11, 2022 | 12:26 PM

Share

Valentine Special 2022: ప్రేమికుల రోజు(Lovers Day) అంటే లవర్స్ కు ఎప్పుడూ ఇష్టమే. ఇక ఒక వారం రోజుల ముందు నుంచే అంటే ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ (Valentine Week) ప్రారంభమవుతుంది. రోజ్ డే నుంచే ప్రతి రోజునీ ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రేమ జంటలు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ప్రతి ఒక్కరూ తమ ప్రేమ భాగస్వామితో ఈ వారం మొత్తం జరుపుకుంటున్నారు. 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రేమికులకు ఒక పండగలానే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొన్ని రాశుల వారికి వాలెంటైన్స్ వీక్ చివరి 5 రోజులు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కనుక వాలెంటైన్ ఈ నాలుగు రాశుల వారికి స్పెషల్ గిఫ్ట్స్ తీసుకురాబోతున్నదో తెలుసుకుందాం.

మిధునరాశి వాలెంటైన్స్ వీక్‌లోని చివరి 5 రోజులు మిధున రాశి వారికి చాలా ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి. ఈ రాశివారు ఎవరితోనైనా హృదయపూర్వకంగా మాట్లాడితే.. భాగస్వామికి ప్రతిపాదన చేస్తే.. మంచి రెస్పాన్స్ వస్తుంది. పెళ్లికి సంబంధించి కొంత యోగం కూడా కలిసి వస్తుంది. అంతేకాదు భార్య భర్తల్లో పరస్పర అవగాహన ఒకరంటే మరికోకరికి ప్రేమ మరింతగా పెరుగుతుంది.

కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వాలెంటైన్‌లో మిగిలిన రోజులు సంతోషాన్ని ఇస్తాయి. తమ భాగస్వామిని పెళ్లి కోసం అడిగితే.. అంగీకారం పొందుతారు. అంతేకాదు ఈ రాశివారి వ్యక్తిగత సంబంధంలో ప్రేమ, సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే పెళ్లయిన జంట ఒకరికొకరు దగ్గరవుతారు. మరింత ప్రేమ కలుగుతుంది.

సింహ రాశి సింహ రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ఈ రాశి వ్యక్తుల ప్రేమ జీవితంలో ప్రేమ చాలా పెరుగుతుంది. లవర్ తో వీరి అనుబంధం దృఢంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, కుటుంబ సభ్యుల నుంచి సానుకూలత ఏర్పడుతుంది. కొత్త జంటలు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది చాలా మంచి సమయం.

కన్యరాశి: కన్యా రాశి వారికి ఈ మిగిలిన 5 రోజులు శృంగారభరితంగా ఉండబోతున్నాయి. నిజానికి, వాలెంటైన్స్ వీక్ చివరి సమయం ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైనది. కన్య రాశి వ్యక్తులు ప్రేమలో తమ భాగస్వామికి దగ్గరవుతారు. దీనితో పాటు, వారి ప్రేమ భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రాశివారు ఇప్పుడు ప్రేమ జీవితంలో అదృష్టం. లవర్ పూర్తి మద్దతును పొందుతారు.

Also Read:

 పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?

ఆహారం జీర్ణమవడం లేదా.. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద డ్రింక్‌తో సమస్యకి చెక్..?