Antarvedi: వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం.. వీడియో..

Lakshmi Narasimha Swamy Kalyanam: ఏపీ తూర్పు గోదావరి జిల్లా (East Godavari) లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అంతర్వేది (Antarvedi) లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

Antarvedi: వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం.. వీడియో..
Antarvedi
Follow us

|

Updated on: Feb 12, 2022 | 3:17 AM

Lakshmi Narasimha Swamy Kalyanam: ఏపీ తూర్పు గోదావరి జిల్లా (East Godavari) లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అంతర్వేది (Antarvedi) లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ తంతును జరిపించారు. రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు సాగిన కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భీష్మ ఏకాదశి రోజున కీలక ఘట్టమైన స్వామి వారి కల్యాణోత్సవాన్ని (Sri Lakshmi Narasimha swamy Kalyanam) జరిపించారు. ఈ సందర్భంగా కల్యాణ వేదికను వివిధ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు మృగశిర నక్షత్ర వృశ్చిక లఘ్నంలో శాస్త్రోక్తంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణాన్ని జరిపించారు.

అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు మృగశిర నక్షత్ర వృశ్చిక లఘ్నంలో శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపించారు. శుభలగ్నంలో వేద మంత్రోచ్చరణల మధ్య కల్యాణ క్రతువును పూర్తిచేశారు. అశేష భక్త జనం నరసింహుని వివాహాన్ని తిలకించేందుకు తరలి వచ్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజోలు, పి.గన్నవరం ఎమ్మెల్యేలు వరప్రసాద్‌, కూడిపూడి చిట్టిబాబు వేడుకలో పాల్గొన్నారు.పావన గోదావరీ సాగర సంగమక్షేత్రం… బ్రహ్మదేవుడు యజ్ఞ యాగాలు, వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలి. శ్రీరామ చంద్రుడు దర్శించుకున్న దివ్యధామం అంతర్వేది. లక్ష్మీ నరసింహుడు నిత్య పూజలు అందుకునే పవిత్ర ప్రాంతం. విశేష ప్రాశస్త్యమున్న అంతర్వేది లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులతో అంతర్వేది కిక్కిరిసింది. ఈ మహోత్సవానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు వరప్రసాద్‌, కూడిపూడి చిట్టిబాబు వేడుకలో పాల్గొన్నారు. కాగా.. తీర్ధ మహోత్సవములకు విచ్చేయుచున్న భక్తులకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. స్వామి వారి కళ్యాణ మహత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని రూట్లలో 100 ప్రత్యేక సర్వీసులు నడపుతున్నారు. కాగా.. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 2:35 ని.లకు రథోత్సవం నిర్వహించనున్నారు.

Also Read:

TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు.. షరతులతో..

TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు.. షరతులతో..