TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు.. షరతులతో..

TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సర్వీసులో ఉండగా..

TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు.. షరతులతో..
Ashok Babu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 11, 2022 | 11:55 PM

TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సర్వీసులో ఉండగా.. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారంటూ అశోక్‌ బాబు (Ashok Babu) పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఐడీ కోర్టు (AP CID Court) శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. రూ.20 వేల పూచికత్తుతో కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అరెస్టు అనంతరం దాదాపు 17 గంటలపాటు అశోక్‌బాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయంలోని ఉంచి అధికారులు విచారించారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్‌ రావడంతో అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఫోర్జరీ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు చేశారు. కాగా.. టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో జడ్జి నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.

కాగా.. అశోక్ బాబు అరెస్టుపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని.. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని  దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే  వైఎస్ జగన్ ప్రభుత్వం కక్షగట్టిందంటూ మండిపడ్డారు. అశోక్ బాబు అరెస్ట్‌పై పలువురు టీడీపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:

Kodali Nani: అశోక్‌ బాబైనా, చంద్రబాబైనా చట్టం ముందు ఒకటే.. టీడీపీపై మరోసారి నిప్పులు చెరిగిన కొడాలి నాని..

Andhra Pradesh: ఆ డబ్బంతా ఎటు పోతోంది?.. సర్కార్‌పై చంద్రబాబు సంచలన కామెంట్స్..

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Building Collapses: రాజధానిలో కుప్పకూలిన భవనం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ