Andhra Pradesh: ఆ డబ్బంతా ఎటు పోతోంది?.. సర్కార్‌పై చంద్రబాబు సంచలన కామెంట్స్..
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దిగజారిపోతున్నాయని విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత లాభం తప్ప రాష్ట్ర భవిష్యత్
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దిగజారిపోతున్నాయని విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత లాభం తప్ప రాష్ట్ర భవిష్యత్ కోసం ఏమాత్రం ఆలోచన చేయడం లేదంటూ సీఎం జగన్ పాలనా విధానాలపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. శుక్రవారం నాడు అమరావతిలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కు అనుభవ లేమి కారణంగా.. అన్ని వ్యవస్థలు విధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా చైతన్యం తోనే రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అప్పు 2019 నాటికి రూ. 3,14,495 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ. 7 లక్షల కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. వైసీపీ నిర్వాకం వల్ల ఒక్కొక్క కుటుంబం మీద నాలుగు నుంచి రూ.5 లక్షల అప్పు ఉందన్నారు. ఆస్తులు తాకట్టు పెట్టడమే కాకుండా.. పార్కులను సైతం తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆ అప్పుల భారమంతా రాష్ట్ర ప్రజలపైనే పడుతుందన్నారు.
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, గ్యాస్, లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. మరి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు చంద్రబాబు. ఇదే సమయంలో రాజధాని అంశంపైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడ ఉందో కూడా చెప్పలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఏపీ వాళ్లు కూడా హైదరాబాద్ రాజధాని అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. విభజన చట్టం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఆపలేని పరిస్థితి లో ఉన్నారంటూ వైసీపీ ప్రభుత్వం తీరును విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఎరువుల కొరత రాలేదని, జగన్ ప్రభుత్వం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇక ఉద్యోగుల సమస్యలపైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులకు ఎవరేం చేశారనే దానిపై ధైర్య ఉంటే చర్చకు రావాలని ప్రభుత్వ పెద్దలకు సవాల్ విసిరారు చంద్రబాబు. అశోక్ బాబు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 9-11-18 లోనే కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ నివేదిక మేరకు క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల కోసం పోరాడుతున్న వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పది మందిని అరెస్ట్ చేస్తే వందల మంది, వేల మంది వస్తామని అన్నారు. తమపై పెట్టిన ప్రతి కేసునూ సమీక్ష చేస్తానని, ఎవరినీ వదిలి పెట్టేది లేదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు చంద్రబాబు. పోలీసులు తప్పులు చేసి ఇరుక్కోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను వైసీపీ సర్కార్ మోసం చేస్తోందన్నారు. సినిమా టికెట్ల అంశంపైనా తనదైన శైలిలో స్పందించారు చంద్రబాబు. సినిమా వాళ్ళతో వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.
Also read:
Water Side Effects: అలర్ట్.. చల్లటి నీరు అధికంగా తాగుతున్నారా? అయితే దీనిపై ఓ లుక్కెయ్యండి….