Varun Tej’s Ghani : సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ సినిమా.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే

ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.

Varun Tej's Ghani : సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ సినిమా.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే
Ghani
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2022 | 7:54 AM

Varun Tej’s Ghani : ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ,  సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్య విడుదలైన రోమియో జూలియట్ పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దబాంగ్ 3 బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మధ్యే హీరో వరుణ్ తేజ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..