Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: టాలీవుడ్‌లో ఆ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలనుంది.. దీపిక ఆసక్తికర వ్యాఖ్యలు..

'చఫ్పాక్‌' వంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) నటిస్తోన్న చిత్రం 'గెహ్రాయియా' (Gehraiyaan) .

Deepika Padukone: టాలీవుడ్‌లో ఆ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలనుంది.. దీపిక ఆసక్తికర వ్యాఖ్యలు..
Deepika
Follow us
Basha Shek

|

Updated on: Feb 12, 2022 | 8:41 AM

‘చఫ్పాక్‌’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) నటిస్తోన్న చిత్రం ‘గెహ్రాయియా’ (Gehraiyaan) . యంగ్‌ హీరో సిద్ధాంత్ చతుర్వేది దీపికతో రొమాన్స్‌ చేయనుండగా..అనన్యా పాండే (Ananya Pandey) కీలక పాత్రలో నటించింది. శకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న (ఫిబ్రవరి11) ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోన్న దీపిక.. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అదే సందర్భంలో టాలీవుడ్‌ హీరోల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేసింది.

వారి మధ్య గొడవలు పెట్టడం ఇష్టం లేదు.. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోతో నటించాలని ఉందని ఈ ముద్దుగుమ్మని అడగ్గా.. ‘నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను. అదేవిధంగా అల్లు అర్జున్‌తో ఛాన్స్‌ వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను. టాలీవుడ్‌లో వీరిద్దరూ నాకు బాగా ఇష్టం. ఇద్దరిలో ఎవరంటే బాగా ఇష్టమంటే చెప్పలేను. ఎందుకంటే నా సమాధానాల కారణంగా ఎవరూ గొడవ పడకూడదు ( నవ్వుతూ).అదేవిధంగా ఏయే దర్శకుల సినిమాల్లోనటించాలని ఉందని ప్రశ్నించగా… ఎస్‌.ఎస్‌.రాజమౌళి, అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో సినిమాలు చేయాలనుందని పేర్కొంది. కాగా గతంలో దీపిక, రణ్‌బీర్‌ జంటగా నటించిన ‘యే జవానీ హై దీవానీ’ మూవీకి అయాన్ ముఖర్జీ‌యే దర్శకత్వం వహించారు. ‘గెహ్రాయియా’ తర్వాత ‘పఠాన్‌’ చిత్రంలో నటిస్తోంది దీపిక. షారుక్‌ ఖాన్‌ హీరోగా నటిస్తుండగా, జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘వార్‌’ లాంటి స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:Pushpa: అసలు తగ్గేదేలే అంటోన్న పుష్ప.. బన్నీ, రష్మిక ఫొటోలతో చీరలు.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?

Jagapathi Babu: పుట్టిన రోజున గొప్ప నిర్ణయం తీసుకున్న సీనియర్‌ నటుడు.. ఆయన స్ఫూర్తితో మరో వంద మంది సైతం..

.