Throwback Pic: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? గ్లామర్ షోకు దూరంగా జూనియర్ సౌందర్యగా..
Throwback Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. దీనికి సామాన్యులే పరిమితం కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు...
Throwback Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. దీనికి సామాన్యులే పరిమితం కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం న్యూస్ పేపర్లలో మాత్రమే సినీ తారల ఫోటోలను చూసుకునే అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో వారిని ఫాలో అవుతూ తమ అభిమాన నటీనటులను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నతనంలోనే స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన తారల ఫోటోలను వెతికి పట్టి మరీ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. పైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఓ చిన్నారి కనిపిస్తోంది చూడండి! చూడగానే ఆకట్టుకునే మోము, నుదుట పెద్ద బొట్టు, ఆకట్టుకునే కళ్లతో ఉన్న ఈ చిన్నారి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. కెరీర్‌లో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటతోనే అశేష అభిమానాన్ని సంపాదించుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఐడియా వచ్చిందా.?
చంద్రబింబం వంటి మోముతో అట్రాక్ట్ చేస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు ముంబయిలో జన్మించి మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల తార స్నేహ. 2000 సంవత్సరంలో మలయాళ చిత్రంతో నటించిన స్నేహ.. అదే ఏడాది వచ్చిన ‘తొలి ప్రేమ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పలువురు స్టార్ హీరోల సరసన నటించి, మంచి గుర్తింపు సంపాదించుకున్న స్నేహ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడం విశేషం.
View this post on Instagram
కెరీర్ మొత్తంలో ఎక్స్‌పోజింగ్ జోలికి పోకుండా స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది స్నేహ. అందుకే స్నేహను దివంగత అందాల తార సౌందర్యతో పోల్చుతుంటారు. హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన స్నేహ.. ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్‌గా అలరిస్తోంది.
Also Read: Dhanush: మరో ప్రయోగం చేయనున్న స్టార్ హీరో ధనుష్.. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో అలా..
షూటింగ్ కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన ముద్దుగుమ్మ అలియా..
Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)