Gehraiyaan: ‘గెహ్రాహియా’లో దీపికా ఓవర్ డోస్ రొమాన్స్‌పై విమర్శలు.. ఇన్​స్టాలో రణ్​వీర్​ పోస్ట్​

గెహ్రాహియా' చిత్రానికి సుమిత్‌ రాయ్‌ కథ అందించగా.. కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మించింది. ఈ మూవీలో దీపికా నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. 

Gehraiyaan: 'గెహ్రాహియా'లో దీపికా ఓవర్ డోస్ రొమాన్స్‌పై విమర్శలు.. ఇన్​స్టాలో రణ్​వీర్​ పోస్ట్​
Deepika Padukone Ranveer
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 12, 2022 | 6:49 PM

Deepika Padukone: దీపికా పదుకునే నటించిన ‘గెహ్రాహియా’ ఫిబ్రవరి 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాలు.. వాటి పరిణామాల చుట్టూ ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ షకున్ బత్రా.  దీపికా పదుకునే- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించారు. అలిషా, జైన్‌ అనే జంట ప్రయాణమే ‘గెహ్రాహియా’ స్టోరీ.  దీపిక-సిద్ధాంత్‌ మధ్య లవ్ సీన్స్, హాట్‌ రొమాన్స్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే తీవ్ర చర్చకు దారి తీశాయి. అయితే  బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్(Ranveer Singh)​ మాత్రం తన భార్య, నటి దీపికా పదుకునేపై ప్రశంసల వర్షం కురిపంచాడు.  ‘గెహ్రాహియా’ లో ఆమె నటించిన తీరు గర్వంగా ఉందన్నాడు. వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఆమెని ముద్దుపెడుతూ దిగిన ఫోటోను రణ్​వీర్​ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు అతడు రాసుకొచ్చిన ఇంగ్లీషు పదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పలకడానికి కూడా కష్టమైన ఇంగ్లీష్​ పదాలతో దీపికని పొగిడాడు.

రణ్​వీర్​ పోస్ట్​ చేసిన ఫోటోపై నెటిజన్లు ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. “నీ లాంటి భర్త దొరికితే అమ్మాయిుల లక్కీ గర్ల్స్” అని ఒకరు కామెంట్ చేయగా.. “మీరు చూడచక్కని జంట” అని మరొకరు కామెంట్ చేశారు. ‘మీకు ఈ ఇంగ్లీష్ కాంగ్రెస్ నేత శశిథరూర్ నేర్చించారా’ అని మరొకరు ఫన్నీగా రాసుకొచ్చారు. ‘మీకు ఈ కొటేషన్ రాయడానికి ఆర్జీవీ సాయం చేశాడా’ అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. శశిథరూర్​ కష్టమైన, కఠినతరమైన ఇంగ్లీష్ ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఆర్జీవీ పెట్టే ట్వీట్స్, పోస్ట్స్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. కాగా ‘గెహ్రాహియా’ చిత్రానికి సుమిత్‌ రాయ్‌ కథ అందించగా.. కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మించింది. ఈ మూవీలో దీపికా నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

Also Read: Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్

భర్తను చంపి గొడ్ల చావిడిలో పాతిపెట్టిన భార్య.. 3వ రోజు దుర్వాసన రావడంతో