Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రాన్ని వదలని లీకుల బెడద.. ఒక్కరోజు ముందుగానే కళావతి సాంగ్ లీక్..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రానికి పైరసీ బెడద తప్పడం లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రానికి పైరసీ బెడద తప్పడం లేదు. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రతి చిన్న విషయంలోనూ చిత్రయూనిట్ కంటే ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి.. స్టోరీ వరకు ఇలా ప్రతి చిన్న పాయింట్ లీక్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చిత్రయూనిట్ మహేష్ బాబు గతంలో అసహనం వ్యక్తం చేశారు. సర్కారు వారి పాట సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చిత్రయూనిట్‌కు సూచించారని టాక్ నడిచింది. తాజాగా ఈ చిత్రానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కళావతి పాట ఇప్పుడు నెట్టింట్లో ప్రత్యేక్షమయ్యింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ సినిమా టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‌పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే కళావతి పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రయూనిట్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఈ క్రమంలో కళావతి పాట కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఈ పాట పూర్తిగా నెట్టింట్లో లీక్ కావడంతో సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. కళావతి పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.
Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)
Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..