Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..

Lata Mangeshkar: భారతీయ లెజెండరీ సింగర్, 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన లతా మంగేష్కర్ స్వర్గస్తులయ్యారు. లతాజీ మరణించీ తన పాటలను.. ఎన్నో విశేషాలను తీపి జ్ఞాపకాలుగా..

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..
Follow us

|

Updated on: Feb 12, 2022 | 10:19 PM

Lata Mangeshkar: భారతీయ లెజెండరీ సింగర్, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన లతా మంగేష్కర్ స్వర్గస్తులయ్యారు. లతాజీ మరణించీ తన పాటలను.. ఎన్నో విశేషాలను తీపి జ్ఞాపకాలుగా అందరికీ ఇచ్చారు. తన మృదుమధురమైన గొంతుతో అనేక గీతాలను శాశ్వత గుర్తులుగా మిగిల్చారు. అయితే లతాదీదీ మంచి ఆహార ప్రియురాలు. ముఖ్యంగా మాంసాహార వంటకాలను ఇష్టపడేవారు. అందులోనూ కొత్తిమీర మటన్ కూర అంటే లతా మంగేష్కర్ కు చాలా ఇష్టం.. ఈరోజు కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

కొత్తిమీర మటన్ అంటే ఏమిటి? ఉత్తరాదివారు ఈ కూరను ధనియా వాలా మటన్ అని పిలుస్తారు. కొత్తిమీరతో తయారు చేసే మటన్ కర్రీ. ఈ కూరను తక్కువ మసాలాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈరోజు కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానాన్ని చెఫ్ స్మితా డియో వివరించారు. ఈ రెసిపీ ఇంట్లో సులభంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్ధాలు:

మటన్- 1 కేజీ,

నెయ్యి -5 టేబుల్ స్పూన్లు ,

నల్ల మిరియాల పొడి- 1 టీస్పూన్ ,

ఉల్లిపాయలు- 5-6 తరిగిన ,

అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్,

గరం మసాలా- 1 టీస్పూన్ ,

కొత్తిమీర ఆకులు- 2-3 కట్టలు తరిగినవి ,

పచ్చిమిర్చి – (పేస్ట్ ఒక స్పూన్)

నీరు_1 కప్పు ,

ఉప్పు-రుచికి

ఎండు మిర్చి కారం- రెండు స్పూన్లు

తయారీ విధానం: మీడియం మంట మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో నెయ్యి కరిగించండి. కరిగిన తర్వాత, అందులో ఎండుమిర్చి పొడి వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి. అనంతరం తరిగిన ఉల్లిపాయ వేసి వేయించండి. ఉల్లిపాయలు వేగిన అనంతరం అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరోసారి కలపాలి. 1-2 నిమిషాలు ఉడికించాలి. తరువాత, ప్రెషర్ కుక్కర్‌లో మటన్ ముక్కలను వేసి సుమారు 4-5 నిమిషాలు ఉడికించండి. చివరగా కుక్కర్‌లో గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి.. బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వండి. అనంతరం నీరు పోసి.. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించండి. ఆవిరి వెళ్ళిన తర్వాత ఒక గిన్నెలోకి కొత్తిమీర మటన్ కూరను తీసుకోండి. ఈ కూర చపాతిలోకి, నాన్స్ లోకి చాలా బాగుంటుంది.

Also Read:

6 ఏళ్ల బాలుడి ప్రాణం కోసం తాను క్యాన్సర్ తో పోరాడుతూ.. 61 లక్షల పోగు చేసి అనంతలోకాలకు