Cumin Water: ఆరోగ్యానికి మంచిదని జీలకర్ర నీటిని తాగుతున్నారా..? అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

Cumin water side effects: వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో జీలకర్ర ఒకటి. వంట రుచి కోసం ఉపయోగించే జీలకర్ర బరువు తగ్గడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2022 | 7:59 AM

జీర్ణక్రియ: బరువు తగ్గడం కోసం డైట్ పాటించే వారు చాలా మంది ప్రజలు రోజుకు రెండు మూడు సార్లు జీలకర్ర నీటిని తాగుతారు. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందువల్ల మీరు జీలకర్ర నీటిని తాగినప్పుడల్లా.. దాని పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ఒక్కసారి తాగడమే మేలని సూచిస్తున్నారు.

1 / 5
కాలేయం: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీలకర్ర నీటిని ఎక్కువగా తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాదు, మీరు కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. జీలకర్ర నీటిని తాగే ముందు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.

2 / 5
బాలింతలు: పాలిచ్చే తల్లులు జీలకర్ర తీసుకోవడం ఉత్తమమని భావించినప్పటికీ.. ఈ కాలంలో బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదని సూచిస్తున్నారు. తల్లులకు కూడా పాలివ్వడంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పాలిచ్చే తల్లులు జీలకర్ర వినియోగానికి ముందు వైద్యుల అభిప్రాయాన్ని తీసుకోవాలి.

3 / 5
బ్లడ్ షుగర్: షుగర్‌తో బాధపడుతున్న రోగులు జీలకర్ర నీటిని తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి జీలకర్రను వినియోగిస్తున్నప్పటికీ, దానిని అధికంగా తీసుకుంటే.. ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది.

4 / 5
వాంతులు: ఏదైనా ఎక్కువ తినడం వల్ల హాని కలుగుతుంది. జీలకర్ర నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా వాంతులు మొదలవుతాయి. జీలకర్రలో నార్కోటిక్ గుణాలు ఉన్నాయని.. దీని వల్ల వాంతులు వస్తాయని చెబుతున్నారు.

5 / 5
Follow us