Dj Tillu: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (siddu jonnalagadda).. హీరోయిన్ నేహా శెట్టి (neha shetty) జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు (neha shetty) .
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (siddu jonnalagadda).. హీరోయిన్ నేహా శెట్టి (neha shetty) జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు (neha shetty) . ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తూ వస్తోంది. ఇక విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది డీజే టిల్లు. దీంతో అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు రాబట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.
విడుదలైన మొదటి రోజే ఇండియా ఓవర్సీస్లోనూ మంచి షేర్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కలిసి మొదటి రోజుకుగానూ.. రూ. 3 కోట్ల నెట్.. 5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. నైజాంలో మొదటి రోజే రూ.1.59 కోట్లు.. సీడెడ్ రూ. 47 లక్షలు.. ఉత్తరాంధ్ర.. రూ. 26 లక్షలు.. ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు సాధించినట్లుగా తెలుస్తోంది. అటు ప్రపంచవ్యాప్తంగా డీజే టిల్లు సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా.. ఇప్పటివరకు ఫస్ట్ డే కలెక్షన్స్ అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా డీజే రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్‌లో ప్రీమియర్స్ కలుపుకొని చూస్తే మొదటి రోజు 200k డాలరస్ వసూలైనట్లు సమాచారం. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 7.70 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 8.95 కోట్లు మేర జరిగిందట. ఇక ఈ సినిమాతో సిద్ధుకు బ్లాక్ బస్టర్ హిట్ అందినట్లుగానే అర్థమవుతుంది.
Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..
Gehraiyaan: ‘స్కిన్‌షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్