PM KISAN: పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు భార్యాభర్తలు తీసుకుంటున్నారా..? అయితే ఇబ్బందుల్లో పడినట్లే..!

PM KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. కేంద్రం..

PM KISAN: పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు భార్యాభర్తలు తీసుకుంటున్నారా..? అయితే ఇబ్బందుల్లో పడినట్లే..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2022 | 9:43 AM

PM KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన స్కీమ్‌లలో పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులు ప్రతి ఏడాది రూ. 6 వేల చొప్పున అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏడాదికి మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 10 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే రూ.20వేల వరకు అందాయని చెప్పవచ్చు. ఇక 11వ విడత (11th Installment) డబ్బులు రావాల్సి ఉంటుంది. ఈ విడత డబ్బులు ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్కీమ్‌లో డబ్బులు పొందేవారు కొన్ని విషయాలను గమనించాలి.

ఈ స్కీమ్‌ కింద ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే డబ్బులు వస్తాయి. అంటే భార్య, లేదా భర్త ఎవరో ఒకరు ఒకరికి వస్తాయి. ఒక వేళ ఇంట్లో ఇద్దరికి వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలకు ఇద్దరికీ డబ్బులు వచ్చినట్లయితే ఒకరి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మీ ఇంట్లో పీఎం కిసాన్‌ డబ్బులు వస్తే తప్పకుండా ఒకరి డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకుంటే అధికారులు మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పలు రాష్ట్రాల్లో వీరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మీ ఇంట్లో రూ.4వేలు వస్తున్నట్లయితే మీరు స్వచ్చందంగా అధికారులకు తెలియజేసి వెనక్కి ఇచ్చేయడం మంచిది. లేకపోతే మీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీరు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్‌ పథకం కింద లక్షలాది మంది అర్హల లేకున్నా డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతుంది.

ఇవి కూడా చదవండి:

Kia Carens: కియా నుంచి మరో కొత్త కారు.. ప్రారంభ ధర ఎంతంటే..!

IT Industry Sector: కరోనా సమయంలో పెరిగిన ఆదాయాలు.. ఉద్యోగాలు.. నాస్కామ్‌ సర్వేలో వెల్లడి