IT Industry Sector: కరోనా సమయంలో పెరిగిన ఆదాయాలు.. ఉద్యోగాలు.. నాస్కామ్ సర్వేలో వెల్లడి
IT Industry Sector: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్ ఉంది. కరోనా సమయంలో కూడా భారత ఐటీ కంపెనీల..
IT Industry Sector: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్ ఉంది. కరోనా సమయంలో కూడా భారత ఐటీ కంపెనీల ఆదాయం గణనీయంగా పెరిగడం గమనార్హం. కరోనా బారిన పడిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ పరిశ్రమ ఆదాయాలు 227 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక సమీక్షలో మొత్తం ప్రత్యక్ష ఉద్యోగులను 50 లక్షలకుపైగా చేర్చేందుకు గానూ పరిశ్రమ రంగం 4.5 లక్షల కొత్త ఉద్యోగాలను జోడించినట్లు నాస్కామ్ తెలిపింది. నూతనంగా ఉద్యోగాలలో చేరిన వారిలో 44 శాతానికిపైగా మహిళలు ఉన్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా నాస్కామ్ చీప్ ఎగ్జిక్యూటివ్‌ల సర్వే జరిగింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది 2022లో కూడా వృద్ధిని కొనసాగించగలమని పేర్కొన్నారు. భారత సమాచార సాంకేతిక రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 227 బిలియన్ అమెరికన్ డాలర్ల పరిశ్రమగా మారనుందని తెలిపింది. 15.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నాస్కామ్ వెల్లడించింది.
పెరిగిన ఆదాయాలు..
2021 ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమల ఆదాయాలు 2.3 పెరిగి 194 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఇక 2022 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక వ్యూహాత్మక సమీక్షలో, మొత్తం ప్రత్యక్ష ఉద్యోగులను 50 లక్షల మందికి చేర్చడానికి పరిశ్రమ 4.5 లక్షల కొత్త ఉద్యోగాలను జోడించినట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి