AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS Gorakhpur Recruitment 2022: బీఎస్సీ నర్సింగ్‌ చేశారా? ఎయిమ్స్‌లో  రెండు లక్షల జీతంతో ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS).. కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (College of nursing) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

AIIMS Gorakhpur Recruitment 2022: బీఎస్సీ నర్సింగ్‌ చేశారా? ఎయిమ్స్‌లో  రెండు లక్షల జీతంతో ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..
Aiims
Srilakshmi C
|

Updated on: Feb 16, 2022 | 7:06 AM

Share

AIIMS Gorakhpur Tutor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS).. కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (College of nursing) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 23

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్: 1
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (రీడర్‌): 2
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/లెక్చరర్‌:3
  • ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 17

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.56,100ల నుంచి 2,15,900లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ నర్సింగ్‌/డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర అర్హతలు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Recruitment Cell, All India Institute of Medical Sciences, Gorakhpur, Kunraghat, Gorakhpur, Uttar Pradesh-273008

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IBPS SO Mains 2021 ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ  అడ్మిట్ కార్డులు త్వరలోనే..