IBPS SO Mains 2021 ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డులు త్వరలోనే..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (IBPS SO Mains) మెయిన్స్ 2021 ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 15) విడుదల చేసింది..
IBPS SO Main Results 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (IBPS SO Mains) మెయిన్స్ 2021 ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 15) విడుదల చేసింది. కాగా ఐబీపీఎస్ ఎస్‌ఓ మెయిన్స్ పరీక్ష జనవరి 30 దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజభాష అధికారి, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 535 ఖాళీలను భర్తీ కానున్నాయి. ఐబీపీఎస్ ఎస్‌ఓ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు (IBPS SO Interview admit cards) హాజరయ్యేందుకు అర్హులు. ఇంటర్వ్యూకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలోనే విడుదల కానున్నట్లు, అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని అభ్యర్ధులకు సూచించింది.
ఐబీపీఎస్ ఎస్‌ఓ మెయిన్స్ ఫలితాలు 2021 ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
- ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజీలో కనిపించే IBPS SO 2021 Mains results లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- తర్వాత అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- అభ్యర్ధి ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Also Read: