Indian Rail Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! భారత రైల్వేలో 2, 65,000లకు పైగా ఉద్యోగావకాశాలు.. త్వరలో..

భారత రైల్వే (Indian Railway) విభాగంలో దాదాపు 2, 65,000లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా..

Indian Rail Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! భారత రైల్వేలో 2, 65,000లకు పైగా ఉద్యోగావకాశాలు.. త్వరలో..
Railway Jobs
Follow us

|

Updated on: Feb 15, 2022 | 1:55 PM

Vacancies In Indian Railways:  భారత రైల్వే (Indian Railway) విభాగంలో దాదాపు 2, 65,000లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పార్లమెంటులో తెల్పింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  (Railway Minister Ashwini Vaishnaw)మొత్తం 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో2,177 గెజిటెడ్‌ పోస్టులుకాగా, 2,63,370 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఖాళీలను పూరించనున్నట్లు మంత్రి తన ప్రసంగంలో తెలిపారు.

మొత్తం 2,177 గెజిటెడ్‌ పోస్టుల్లో విభాగాల వారిగా ఖాళీల వివరాలు ఈ విధంగా తెలిపారు.

  • సెంట్రల్‌ రైల్వేలో 56
  • ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 87
  • ఈస్టర్న్‌ రైల్వేలో 195
  • ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 170
  • మెట్రో రైల్వేలో 22
  • నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 141
  • నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 62
  • నార్త్‌ ఈస్ట్‌ ఫ్రంటీర్‌ రైల్వేలో 112
  • నార్తెర్న్‌ రైల్వేలో 115
  • నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 100
  • సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో 43
  • సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 88
  • సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 137
  • సౌతర్న్‌ రైల్వేలో 65
  • వెస్ట్‌ సెంట్రల్ రైల్వేలో 59
  • వెస్ట్రన్‌ రైల్వేలో 172
  • ఇతర రైల్వే విభాగాల్లో 507 గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మొత్తం 2,63,370 నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల్లో విభాగాల వారిగా ఖాళీల వివరాలు ఈ విధంగా..

  • సెంట్రల్‌ రైల్వేలో 27,177
  • ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో8,447
  • ఈస్టర్న్‌ రైల్వేలో28,204
  • ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 15,268
  • మెట్రో రైల్వేలో 856
  • నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 9,366
  • నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 14,231
  • నార్త్‌ ఈస్ట్‌ ఫ్రంటీర్‌ రైల్వేలో 15,477
  • నార్తెర్న్‌ రైల్వేలో 37,436
  • నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 15,049
  • సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో 16,741
  • సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 9,422
  • సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 16,847
  • సౌత్‌ ఇండియన్‌ రైల్వేలో 9,500
  • సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 6,525
  • వెస్ట్‌ సెంట్రల్ రైల్వేలో 11,073
  • వెస్ట్రన్‌ రైల్వేలో 26,227
  • ఇతర విభాగాల్లో 11,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులన్నింటినీ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా వివిధ సెషన్లలో భర్తీ చేస్తామని రైల్వే మినిస్టర్‌ తెలిపారు. కాగా గత నెల్లో వివిధ విభాగాల్లోని దాదాపు 35,281 రైల్వే నియామకాలను రద్దుచేసినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read:

Diabetes diet: తెలుసా! ఈ జ్యూస్‌ తాగారంటే 3 గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతుంది..