APVVP Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! బారీ స్థాయిలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..

వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించాలి ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది..

APVVP Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! బారీ స్థాయిలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..
Ap Jobs
Follow us

|

Updated on: Feb 15, 2022 | 11:47 AM

Andhra Pradesh government creates 2,588 new posts: ఏపీ ప్రభుత్వం మరోమారు బారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో కొత్తగా మరో 2,588 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 446 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, 6 డిప్యూటీ డెంటల్‌ సర్జన్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 57 స్టాఫ్‌నర్స్‌ పోస్టులు, 74 ఫార్మసిస్టు పోస్టుల, 235 ల్యాబ్‌ టెక్నీషిన్‌ ఉద్యోగాలు, 74 బయోమెడికల్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. పొరుగు సేవల కింద 279 థియేటర్‌ ఆసిస్టెంట్స్‌, 365 పోస్టుమార్టం అసిస్టెంట్స్‌, 52 కౌన్సెలర్స్‌, 49 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులు, 684 జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌, 50 ప్లంబర్‌ పోస్టులు, 50 ఎలక్ట్రీషియన్‌ పోస్టులను పొరుగు సేవల కింద భర్తీ చేయనుంది. వీటిల్లో పదో తరగతి, ఐటీఐ అర్హతతో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను సంబంధించిన వివరానాత్మక నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనుంది.

Also Read:

ESIC Recruitment 2022: పదో తరగతి అర్హతతో 3,800కుపైగా ఈఎస్‌ఐసీ జాబ్స్‌.. ఇంకా అప్లై చేయలేదా? ఈ రోజుతో ముగుస్తున్న గడువు!