Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC Recruitment 2022: పదో తరగతి అర్హతతో 3,800కుపైగా ఈఎస్‌ఐసీ జాబ్స్‌.. ఇంకా అప్లై చేయలేదా? ఈ రోజుతో ముగుస్తున్న గడువు!

ఈ రోజు (15 ఫిబ్రవరి)తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తున్నందున.. ఈ పోస్టులకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని..

ESIC Recruitment 2022: పదో తరగతి అర్హతతో 3,800కుపైగా ఈఎస్‌ఐసీ జాబ్స్‌.. ఇంకా అప్లై చేయలేదా? ఈ రోజుతో ముగుస్తున్న గడువు!
Esic
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2022 | 11:21 AM

ESIC Recruitment 2022: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) (అప్పర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్ పోస్టుల) 3,800కు పైగా పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రోజు (15 ఫిబ్రవరి)తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తున్నందున.. ఈ పోస్టులకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఈఎస్‌ఐసీ సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, తాజా నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 3820

విభాగాల వారీగా ఖాళీలు

  • అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ): 1726
  • స్టెనోగ్రాఫర్‌:163
  • మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌):1931

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

  • ఏపీలో మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. వీటిలో యూడీసీ (07), ఎంటీఎస్ (26), స్టెనో (02) పోస్టులు ఉన్నాయి.
  • తెలంగాణ‌లో మొత్తం 72 పోస్టుల‌కు గాను యూడీసీ (25), ఎంటీఎస్ (43), స్టెనో (04) ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:

  • పైన తెలిపిన వాటిలో ఎంటీఎస్‌ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
  • స్టేనో, యూడీసీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 18-27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్స్‌), స్కిల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

JAM 2022 Answer Key: మరో వారం రోజుల్లో JAM 2022 ఆన్సరీ కీ.. ఫలితాలు ఎప్పుడంటే..

వరూథిని ఏకాదశి రోజున వామనుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా..
వరూథిని ఏకాదశి రోజున వామనుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా..
సూపర్‌ ప్యాసెంజర్‌ వ్యాన్‌ రిలీజ్‌ చేసిన మారుతీ సుజుకీ
సూపర్‌ ప్యాసెంజర్‌ వ్యాన్‌ రిలీజ్‌ చేసిన మారుతీ సుజుకీ
ఇండస్ట్రీలో లక్కీ డేట్ ట్రెండ్.. పాన్ ఇండియా సినిమాలకూ అప్లై..
ఇండస్ట్రీలో లక్కీ డేట్ ట్రెండ్.. పాన్ ఇండియా సినిమాలకూ అప్లై..
బెల్జియంలో మెహుల్‌ చోక్సీ అరెస్ట్.. భారత్‌కు తీసుకువచ్చేందుకు..
బెల్జియంలో మెహుల్‌ చోక్సీ అరెస్ట్.. భారత్‌కు తీసుకువచ్చేందుకు..
'నోర్మూసుకుని.. ఓ మూలనకూర్చుని ఏడవండి' రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైర్
'నోర్మూసుకుని.. ఓ మూలనకూర్చుని ఏడవండి' రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైర్
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు ఈ హెర్బల్ టీని తాగిచూడండి..
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు ఈ హెర్బల్ టీని తాగిచూడండి..
అమ్మకాల్లో చేతక్ ఈవీ రికార్డులు.. మార్కెట్ వాటా ఎంతంటే..?
అమ్మకాల్లో చేతక్ ఈవీ రికార్డులు.. మార్కెట్ వాటా ఎంతంటే..?
హీరోయిన్‌ను బ్లౌజ్ తీసెయ్యమన్న దర్శకుడు..
హీరోయిన్‌ను బ్లౌజ్ తీసెయ్యమన్న దర్శకుడు..
అనకాపల్లి పేలుడుకు కారణాలు ఇవేనా?..అసలు అక్కడ ఏం జరిగింది?
అనకాపల్లి పేలుడుకు కారణాలు ఇవేనా?..అసలు అక్కడ ఏం జరిగింది?
లైవ్ మ్యాచ్‌లో కోహ్లీకి హార్ట్ ఎటాక్.. శాంసన్ ఏం చేశాడంటే?
లైవ్ మ్యాచ్‌లో కోహ్లీకి హార్ట్ ఎటాక్.. శాంసన్ ఏం చేశాడంటే?