JAM 2022 Answer Key: మరో వారం రోజుల్లో JAM 2022 ఆన్సరీ కీ.. ఫలితాలు ఎప్పుడంటే..

JAM 2022 పరీక్షకు సంబంధించిన అనధికారిక సమాధాన కీని వివిధ నిపుణులు విశ్లేషించి విడుదల చేశారు. ఇక అఫీషియల్ ఆన్సర్ కీ 1, 2 వారాల్లో వెలువడనుంది..

JAM 2022 Answer Key: మరో వారం రోజుల్లో JAM 2022 ఆన్సరీ కీ.. ఫలితాలు ఎప్పుడంటే..
Jam 2022 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2022 | 10:40 AM

JAM 2022 unofficial answer key released: మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (MSc)లో ప్రవేశాలకు మొత్తం ఏడు పేపర్లకుగాను జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌ (JAM 2022) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) ఈనెల13న నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన అనధికారిక సమాధాన కీని వివిధ నిపుణులు విశ్లేషించి విడుదల చేశారు. ఇక అఫీషియల్ ఆన్సర్ కీ 1, 2 వారాల్లో వెలువడనుంది. జామ్ 2022 ఫలితాలు 22 మార్చిన ప్రకటించబడతాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jam.iitr.ac.in నుండి ఆన్సర్‌ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఏడు పేపర్లకు సంబంధించిన ఆన్సర్ కీని విడిగా విడుదల చేస్తారు. రెస్పాన్స్‌ షీట్, క్వశ్చన్‌ పేపర్లను కూడా సమాధానాల కీతో విడుదల చేయబడతాయి. జామ్‌ స్కోర్‌ను లెక్కించడానికి ఇవి ఉపయోగపడతాయి. అధికారిక ఆన్సర్‌ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే జామ్‌ ఆన్సర్ కీని సవాలు చేయడానికి IIT అభ్యర్థులకు JAM JOAPS అవకాశం కల్పిస్తోంది. అభ్యర్థులు ప్రతి అభ్యంతరానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు మూల్యాంకనం చేయబడతాయి. చెల్లుబాటు అయ్యే అభ్యంతరాల ఆధారంగా తుది ఆన్సర్‌ కీని తయారుచేస్తారు. దీని ఆధారంగానే ఫలితాలు విడుదలవుతాయి.

అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎలా చెక్‌ చేసుకోవాలంటే.. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌jam.iitr.ac.in ను ఓపెన్ చెయ్యాలి. JAM JOAPS లింక్‌పై క్లిక్ చేసి, ఐడీ/ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అర్థమాటిక్‌ ఈక్వేషన్‌ను ఎంటర్ చెయ్యాలి. తర్వాత సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి. డ్యాష్‌బోర్డ్ నుండి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. జామ్‌ 2022 స్కోర్‌కార్డులో.. అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, టెస్ట్ పేపర్ కోడ్, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, స్కోర్ చేసిన మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్, జనవరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు ఎంతెంత కట్ ఆఫ్ మార్కులు (ఎన్సీఎల్‌), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, అభ్యర్థి ఫోటోగ్రాఫ్, అభ్యర్థి సంతకం మొదలైనవి ఉంటాయి.

కాగా జాయింట్ అడ్మిషన్ టెస్ట్ అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిలో మొత్తం 7 సబ్జెక్టులు ఉంటాయి. అవేంటంటే.. బయోటెక్నాలజీ, జియాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఈ పరీక్ష 3 గంటలపాటు నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. సెక్షన్ Aలో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQలు), సెక్షన్ Bలో 10 మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ (MSQలు), సెక్షన్ Cలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలుంటాయి. ఇలా మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండు సంవత్సరాల M.Sc, M.Sc.-PhD డ్యూయల్‌ డిగ్రీ, జాయింట్‌ ఎమ్మెస్సీ – పీహెచ్‌డీ ప్రోగ్రం, ఇతర పోస్ట్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ చదవాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read:

IISC Bangalore Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..