IISC Bangalore Recruitment 2022: బీటెక్/ఎంటెక్ అర్హతతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ సైన్స్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ సైన్స్ (IISc) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff job) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
IISC Bangalore Recruitment 2022: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ సైన్స్ (IISc) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff job) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13
పోస్టుల వివరాలు:
- ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ (సివిల్, ఎలక్ట్రికల్): 2
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (సివిల్, ఎలక్ట్రికల్): 4
- ప్రాజెక్ట్ అసోసియేట్ (సివిల్, ఎలక్ట్రికల్): 6
- ప్రోగ్రాం అసిస్టెంట్: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: పోస్టును బట్టి నెలకు రూ.28,000ల నుంచి 49,000లవరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: