Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ..

Tirumal Tirupati Temple: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్. 6 నెలల గ్యాప్‌ తర్వాత ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ చేస్తోంది టీటీడీ. రోజుకు 10వేల టోకెన్స్‌..

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 15, 2022 | 10:52 AM

Tirumal Tirupati Temple: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్. 6 నెలల గ్యాప్‌ తర్వాత ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ చేస్తోంది టీటీడీ. రోజుకు 10వేల టోకెన్స్‌ ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దాంతో, టోకెన్స్‌ కోసం క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. ఇక, రేపట్నుంచి ఉదయాస్తమాన సేవా టికెట్స్‌ను అందుబాటులో ఉంచుతోంది. కోటిన్నర రూపాయలు విరాళమిస్తే శుక్రవారం, కోటి రూపాయలు విరాళమిస్తే మిగతా రోజుల్లో ఉదయాస్తమాన సేవా భాగ్యం కల్పించనుంది టీటీడీ.

నేటి నుండి సర్వ దర్శన టోకెన్ల జారీ.. కరోనా పరిస్థితులతో నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరించింది టీటీడీ. తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శన టోకెన్ల జారీ చేస్తోంది. రోజుకు 10 వేల టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా జారీ చేస్తుంది. 6 నెలల తర్వాత సర్వ దర్శన టోకెన్ల కరెంట్ బుకింగ్‌ను పునరుద్ధరించడంతో.. భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు పొందేందుకు తిరుపతిలోని క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

రేపు అందుబాటులోకి ఉదయస్తమాన సేవా టికెట్లు.. టీటీడీ ప్రకటించిన ఉదయస్తమాన సేవా టికెట్లు రేపు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్ సైట్‌లో ఉదయస్తమాన సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఉదయస్తమాన సేవా టికెట్ల బుకింగ్‌కు స్పెషల్ విండో ఏర్పాటు చేశారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు విరాళమిచ్చిన దాతలకు ప్రివిలైజ్‌గా ఉదయాస్తమాన టికెట్ కేటాయించనుంది టీటీడీ. రూ.1.5 కోటి విరాళమిస్తే శుక్రవారం, రూ.1 కోటి విరాళమిస్తే మిగిలిన రోజుల్లో ఉదయాస్తమాన సేవా భాగ్యం కల్పించనున్నారు. కాగా, శుక్రవారాల్లో 28 ఉదయస్తమాన సేవా టికెట్లు ఖాళీగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. మిగిలిన రోజుల్లో 503 టికెట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఉదయస్తమాన సేవలను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది టీటీడీ. ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో రూ.5లక్షలు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని టీటీడీ ప్రకటించింది. ఆఫ్‌లైన్ ద్వారా మిగిలిన మొత్తం చెల్లించని పక్షంలో రూ.5 లక్షలు రీఫండ్ చేయమనుంది. కాగా, ఒకరికి ఒక టికెట్లు మాత్రమే కేటాయిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

ఈ ఉదయస్తమాన సేవా టికెట్టు కింద వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్ల పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవ కల్పించనున్నారు. అదే సంస్థలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో ఉదయస్తమాన సేవ భక్తులకు సుప్రభాతం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మంగళ, బుధ, గురువారాల్లో టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన (మంగళవారం), తిరుప్పావడ సేవ(గురువారం), కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుక్రవారాల్లో ఉదయస్తమాన సేవా టికెట్లు కలిగిన భక్తులకు సుప్రభాతం, అభిషేకం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Also read:

Hyderabad: రాత్రి బయటకు వెళ్లిన యువతి.. తెల్లారి మామిడితోటలో శవమై తేలింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Medaram Jatara 2022: నేడు మేడారం మహాజాతరకు బయలుదేరనున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు..

Mirchi Cost Today: ఘాటెక్కిన ఎర్ర బంగారం.. రికార్డ్ స్థాయికి చేరిన దేశీ రకం మిర్చి ధర..