Hyderabad: రాత్రి బయటకు వెళ్లిన యువతి.. తెల్లారి మామిడితోటలో శవమై తేలింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Hyderabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హతమార్చారు.

Hyderabad: రాత్రి బయటకు వెళ్లిన యువతి.. తెల్లారి మామిడితోటలో శవమై తేలింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 15, 2022 | 8:56 AM

Hyderabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హతమార్చారు. యువతి చున్నీతోనే ఉరి బిగించి చంపేశారు. ఈ దారుణ ఘటన జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో చోటు చేసుకుంది. హుగ్గెల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతురాలు అదే గ్రామానికి చెందిన మౌనిక(17)గా నిర్ధారించారు. వివరాల్లోకెళితే.. హుగ్గెల్లి గ్రామానికి చెందిన మౌనిక జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, తల్లి ఇంట్లో లేని సమయంలో రాత్రి బయటికి వెళ్లింది మౌనిక. అలా బయటకు వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. ఉదయం మామిడితోటలో పనిచేసిన కూలీలు మౌనిక మృతదేహాన్ని గుర్తించి గ్రామ సర్పంచ్‌కు తెలియజేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మౌనిక మృతదేహాన్ని పరిశీలించారు. అత్యాచారం చేసి ఆపై చున్నీతో ఉరి బిగించి హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. తెలిసిన వాళ్లే మౌనికను బయటికి రప్పించి అత్యాచారానికి పాల్పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also read:

Medaram Jatara 2022: నేడు మేడారం మహాజాతరకు బయలుదేరనున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు..

Mirchi Cost Today: ఘాటెక్కిన ఎర్ర బంగారం.. రికార్డ్ స్థాయికి చేరిన దేశీ రకం మిర్చి ధర..

Kurnool Politics: రోడ్ల విస్తరణ వివాదం.. కర్నూలులో కాక రేపుతున్న సవాళ్ల రాజకీయం..