AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool Politics: రోడ్ల విస్తరణ వివాదం.. కర్నూలులో కాక రేపుతున్న సవాళ్ల రాజకీయం..

Bhuma vs Gangula: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. నాలుగు దశాబ్దాల ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన గంగుల భూమా కుటుంబాల

Kurnool Politics: రోడ్ల విస్తరణ వివాదం.. కర్నూలులో కాక రేపుతున్న సవాళ్ల రాజకీయం..
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2022 | 8:03 AM

Share

Bhuma vs Gangula: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. నాలుగు దశాబ్దాల ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన గంగుల భూమా కుటుంబాల మధ్య చిచ్చు రాజేసింది. రోడ్డు విస్తరణ పనుల్లో అవినీతి జరిగినట్లు తేలితే రాజీనామాకు సిద్ధం అని ఎమ్మెల్యే అంటే.. అవినీతి తేల్చకుంటే రాజకీయ సన్యాసానికి సిద్ధం అని మాజీ మంత్రి ప్రతి సవాలు చేయడం కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రస్తుతం రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగానే రోడ్డుకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో దివంగత నేత భూమా నాగిరెడ్డి పేరుమీద నాలుగు రోడ్ల సర్కిల్లో ఉన్న బస్సు షెల్టర్‌ని కూల్చివేశారు. ఈ కూల్చివేత పనులను భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ భారీ జన సమీకరణతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భూమా జగత్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై భూమా అఖిలప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము కట్టిస్తే మీరు కూల్చి చేస్తారా? ఇదేనా మీ సంస్కృతి అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా ఆర్లగడ్డ రోడ్ల విస్తరణ పనులలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కి ఆయన కుటుంబీకులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని కలెక్టర్ సమక్షంలో నిరూపిస్తానని సవాల్ విసిరారు. రుజువైతే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. లేకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అంటూ బహిరంగ సవాల్ విసిరారు.

గంగుల ప్రతి సవాల్.. భూమా అఖిలప్రియ సవాళ్లపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కూడా స్పందించారు. రేపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని, రోడ్ల విస్తరణ పనుల్లో అవినీతి పై విచారణ జరిపించాలని కోరనున్నట్లు స్పష్టం చేశారు. రుజువైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. అవినీతి నిరూపించ లేకపోతే అఖిలప్రియ రాజకీయ సన్యాసం స్వీకరించాలని ప్రతి సవాల్ విసిరారు. పచ్చగడ్డి వేయకుండానే రెండు కుటుంబాల మధ్య భగ్గుమనే పరిస్థితులలో.. తాజా సవాళ్లు కర్నూలులో మరింత హిట్ పెంచింది.

Also read:

GATE 2022 Results: గేట్‌ 2022 రెస్పాన్స్‌ షీట్లు విడుదల నేడే ..! ఫలితాలు ఎప్పుడంటే..

IPL 2022: వేలానికి ముందు శత్రువులు.. అనూహ్యంగా ఒకే జట్టులో చేటు.. ఆసక్తి రేపుతోన్న ‘ఆ నలుగురు’..

అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో