GATE 2022 Results: గేట్‌ 2022 రెస్పాన్స్‌ షీట్లు విడుదల నేడే ..! ఫలితాలు ఎప్పుడంటే..

GATE 2022 Response Sheet 2022లను ఫిబ్రవరి 15 (మంగళవారం) విడుదల చేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది..

GATE 2022 Results: గేట్‌ 2022 రెస్పాన్స్‌ షీట్లు విడుదల నేడే ..! ఫలితాలు ఎప్పుడంటే..
Gate 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2022 | 7:52 AM

GATE 2022 Response Sheet 2022లను ఫిబ్రవరి 15 (మంగళవారం) విడుదల చేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) ఈ రోజు విడుదల చేయనుంది. గేట్‌ రెస్పాన్స్ షీట్లు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.gate లేదా iitkgp.ac.inలో తనిఖీ చేసుకోవచ్చు. కాగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022)ను ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు ఉదయం – మధ్యాహ్నం రెండ్‌ సెషన్లలో, ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. గేట్ 2022 కీలను ఫిబ్రవరి 21 ( సోమవారం) విడుదల చేస్తుంది. తుది ఫలితాలు మార్చి 17 (గురువారం)న ఆన్‌లైన్‌లో ప్రకటించబడుతుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను మార్చి 21 (సోమవారం) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2022 పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.gate.iitkgp.ac.inను సందర్శించాలని అభ్యర్ధులకు ఈ సందర్భంగా సూచించింది.

గేట్ 2022 రెస్పాన్స్ షీట్‌లను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో ‘లాగిన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌/ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • వెంటనే అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్లు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

Also Read:

IGNOU certificate courses: ఫుడ్‌ అండ్‌ నూట్రీషన్‌.. కొత్త కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. పూర్తి వివరాలు ఇవే!