IGNOU certificate courses: ఫుడ్‌ అండ్‌ నూట్రీషన్‌.. కొత్త కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. పూర్తి వివరాలు ఇవే!

ఇగ్నో తన పరిధిలో కొత్త కోర్సును ప్రారంభించింది. ఫిబ్రవరి 14 (సోమవారం)న ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ (Food and Nutrition certificate programme)ను వర్చువల్ మోడ్‌లో ప్రారంభించింది..

IGNOU certificate courses: ఫుడ్‌ అండ్‌ నూట్రీషన్‌.. కొత్త కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. పూర్తి వివరాలు ఇవే!
Food And Nutrition From Ign
Follow us

|

Updated on: Feb 15, 2022 | 7:24 AM

IGNOU Food and Nutrition course: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ఫిబ్రవరి 14 (సోమవారం)న ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ (Food and Nutrition certificate programme)ను వర్చువల్ మోడ్‌లో ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.ignouiop.samarth వెబ్‌సైట్‌ను సందర్శించి, నమోదు చేసుకోవచ్చు. ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్‌ సర్టిఫికేట్ కోర్సు అనేది కనీస అక్షరాస్యత స్థాయి అవగాహన కార్యక్రమం. అంటే చదవడం, రాయండ తెలిసిస అభ్యర్ధుల కోసం ఏర్పాటు చేయబడింది. వ్యక్తి, కుటుంబం, సమాజానికి ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించడంలో ఆహారం పాత్రను అభ్యాసకులకు పరిచయం చేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్ధేశ్యం. ఆహార ఎంపిక – తయారీ, చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకు అవసరమైన పోషకాహారం, ఎకనామిక్స్‌ ఆఫ్‌ ఫుడ్‌, కిచెన్ గార్డెనింగ్, ఆహార కల్తీ, వినియోగదారుల హక్కులు, భద్రతా విద్య వంటి ఇతర అంశాలు ఈ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా అభ్యర్ధులు నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం పోషకాహారానికి ప్రాథమిక ప్రాధాన్యతనిస్తుంది. కాగా ఇప్పటికే ఇగ్నో ఆన్‌లైన్ మోడ్‌లో పలు కోర్సులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే! తాజా కోర్సును కూడా ఆన్‌లైన్‌ మోడ్‌లోనే అందించనుంది.

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె. పాల్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. IGNOU దాని పరిధితో ఈ ప్రోగ్రామ్‌ను పెద్ద లెర్నర్-బేస్‌కు అందుబాటులోకి తీసుకురాగలదని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. ఇక ఈ కోర్సులో ప్రవేశంకోరే అభ్యర్ధులకు ఎటువంటి ప్రత్యేక విద్యార్హత అవసరం లేదు. ఐతే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ఈ కోర్సుకు సంబంధించిన ఫీజు, అర్హతలు, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ www.ignouiop.samarth.edu.inలో తెలుసుకోవచ్చు.

Also Read:

UGC-IUAC Recruitment 2022: బీటెక్‌/ఎమ్మెస్సీ అర్హతతో.. యూజీసీ-ఐయూఎసీలో ఉద్యోగాలు..నెలకు లక్షపైనే జీతం..

Latest Articles