AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. అడిగిన డబ్బు ఇవ్వలేదని..

Andhra Pradesh: ప్రభుత్వ ధవాఖానాలే పేదల దేవాలయాలు. అలాంటి దేవాలయాల్లో దేవుడు వరమిచ్చినా పూజారీ కరుణించలేదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది..

Andhra Pradesh: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. అడిగిన డబ్బు ఇవ్వలేదని..
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2022 | 6:30 AM

Share

Andhra Pradesh: ప్రభుత్వ ధవాఖానాలే పేదల దేవాలయాలు. అలాంటి దేవాలయాల్లో దేవుడు వరమిచ్చినా పూజారీ కరుణించలేదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది అవినీతి. ఆపత్రులకు వచ్చే రోగులు వారి బంధువుల రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాము అడిగిన డబ్బు ఇవ్వలేదని రోగిని తీసుకెళ్లేందుకు వీల్ చైర్ సైతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన ఘటన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసింది.

వివరాల్లోకెళితే.. ఏపీలో అతిపెద్ద ఆసుపత్రి విజయవాడ ప్రభుత్వాసుపత్రి. ఎక్కడా లేని విధంగా అధునాతన వైద్యాన్ని పేదలకు అందిస్తున్నారు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేసి ఎంతో మంది పేదల ప్రాణాలను ఇక్కడి వైద్యులు కాపాడారు. అయితే ఇక్కడి కింది స్థాయి సిబ్బంది అవినీతి మాత్రం తారా స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ రోగులకు సహాయకులుగా పని చేసే ఆయాలు, వార్డ్ బాయ్ లు దారుణాలకు పాల్పడుతున్నారు. వీరి అవినీతి ఆగడాలతో ప్రభుత్వాసుపత్రికి రావాలంటే కూడా పేదలు భయపడుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వలేదని వీల్ చైర్ ఇవ్వకుండా వృద్ధురాలితో పాటు ఆమె బంధువులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. లంచం ఇచ్చుకోలేని స్థితిలో మహిళను ఆమె బంధువులు చేతులపై ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ తో వైద్యం చేపించుకుని మళ్ళీ అదే చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లిన ఘటన ప్రతి ఒక్కరినీ అయ్యో పాపం అనిపిస్తుంది.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం డోలాస్ నగర్‌కు చెందిన వృద్ధురాలి సామ్రాజ్యంకు కొంత కాలం క్రితం షుగర్ వచ్చింది. అయితే ఆమె కాలికి గాయం కావడంతో ఇన్ఫెక్షన్ అయింది. దీంతో వారం రోజుల క్రితం వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలగించారు. అయితే కుట్లు తిపించేందుకు ఆమెను హాస్పిటల్ కు తీసుకోచ్చారు. హాస్పిటల్ లోపలికి ఆమెను వీల్ చైర్ లో తీసుకెళ్లాలి. కానీ వీల్ చైర్ కనిపించలేదు. లోపలికి వెళ్లి వార్డ్ బాయ్ ని వీల్ చైర్ కావాలని అడిగారు. రెండు వందల రూపాయలు ఇస్తేనే వీల్ చైర్ పై పేషంట్ ని తీసుకెళ్తాను అని చెప్పాడు. అంత డబ్బులు లేవని పేషంట్ ను తీసుకొచ్చేందుకు చార్జీలకు మాత్రమే తమ వద్ద ఉన్నాయని చెప్పాడు బాధితురాలి బంధువు. దింతో వీల్ చైర్ లేదని వార్డ్ బాయ్ చెప్పాడు. చేసేది లేక వృద్ధురాలితో వచ్చిన ఆమె కొడుకు మరో వ్యక్తి కలిసి ఆమెను చేతుల పై ఎత్తుకు వెళ్లి డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం మళ్ళీ ఆమెని చేతుల పై ఎత్తుకుని అతి కష్టంగా బయట ఆటో వద్దకు తీసుకొస్తూ టివి9 కెమెరా కంట పడ్డారు. ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు అని అడగడంతో సిబ్బంది చేసిన బాగోతం చెప్పారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారు.

టివి9 లో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది బాగోతంపై వచ్చిన కథనాలపై స్పందించిన జిజిహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ స్పందించారు. ఘటనపై విచారణ చేపట్టామన్నారు. బాధితుల నుండి పూర్తి వివరాలను సేకరిస్తున్నామన్నారు. వృద్ధురాలి బంధువుల వద్ద డబ్భులు డిమాండ్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సరిపడా వీల్ చైర్లు, స్ట్రెక్చర్ లు ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది లంచం అడిగితే 14400 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలని కోరారు.

Also read:

Hyderabad Numaish: నుమాయిష్ ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే..

IPO News: IPO లో పెట్టుబడి పెట్టేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

Viral Video: ఈ డ్రైవర్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందేనన్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో