AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Numaish: నుమాయిష్ ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే..

Numaish Re-Open: కరోనా కారణంగా అర్దాంతరంగా మూతపడ్డ నుమాయిష్ ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం కానుంది. ప్రపంచ వాణిజ్య వస్తు ప్రదర్శనగా నిలిచే నాంపల్లి ఎగ్జిబిషన్..

Hyderabad Numaish: నుమాయిష్ ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే..
Numaish
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2022 | 6:21 AM

Share

Numaish Re-Open: కరోనా కారణంగా అర్దాంతరంగా మూతపడ్డ నుమాయిష్ ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం కానుంది. ప్రపంచ వాణిజ్య వస్తు ప్రదర్శనగా నిలిచే నాంపల్లి ఎగ్జిబిషన్.. ఈ నెల 25 నుంచి రీ ఓపెన్ కానుంది. జీహెచ్ఎంసీ, ఫైర్, పోలీస్ సహా అన్ని విభాగాల పర్మిషన్లతో పునః ప్రారంభం చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. నెలన్నర పాటు నగరవాసులకు నుమాయిష్ సందడి చేయనుంది.

కొత్త సంవత్సరం రోజున ఇలా ప్రారంభమై.. అలా ముగిసింది నుమాయిష్ ఎగ్జిబిషన్. గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకుతో ఆంక్షలు విధించిన వేళ మరుసటి రోజు రాత్రి నుంచే మూతపడింది. కొద్దిరోజులు వేచి చూసినా లాభం లేకపోవడంతో స్టాల్స్ నిర్వాహకులు కూడా వెనుదిరిగారు. నెలన్నర తరువాత పరిస్థితులు చక్కబడటంతో ప్రదర్శన తిరిగి ప్రారంభించాలని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయత్నాలు ప్రారంభించి సక్సెస్ అయింది. పోలీస్ సహా అన్ని విభాగాల అనుమతితో ఈ నెల 25 నుంచి తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటన చేసింది.

దాదాపు 45 రోజుల పాటు 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ కొనసాగే అవకాశం ఉంది. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఎగ్జిబిషన్ జరగనుంది. వారాంతపు రోజుల్లో మరో అరగంట అదనంగా అంటే రాత్రి 11 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఈ మేరకు స్టాల్ నిర్వాహకులకు ఆహ్వానాలు పంపారు. దాదాపు15 వందల నుంచి 2 వేల వరకు స్టాల్స్ కొలువుదీరనున్నాయి. చాలా కాలం తర్వాత మళ్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ పూర్వ వైభవంతో అలరించబోతుంది. నగరమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అనేక రకాల వస్తువులు సందర్శకులు కొనుగోలు చేస్తారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలు అయ్యేలా ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకోనుంది.

Also read:

Silver Price Today: వెండి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర

Banyan Tree: 70 సంవత్సరాల చెట్టుకు జీవం పోసిన వ్యక్తి.. మరో చోటికి తరలించిన ఎంపీ.. అసలు ఏం జరిగిందంటే..

Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..