Banyan Tree: 70 సంవత్సరాల చెట్టుకు జీవం పోసిన వ్యక్తి.. మరో చోటికి తరలించిన ఎంపీ.. అసలు ఏం జరిగిందంటే..

రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగిన 70 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టుకు..

Banyan Tree: 70 సంవత్సరాల చెట్టుకు జీవం పోసిన వ్యక్తి.. మరో చోటికి తరలించిన ఎంపీ.. అసలు ఏం జరిగిందంటే..
Banyan Tree
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 15, 2022 | 6:00 AM

రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగిన 70 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టు(banyan tree)కు కొత్త జీవం పోసి మరోచోటికి మార్చారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవంతంగా చెట్టను మరోచోటికి మార్చామని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జే సంతోష్‌కుమార్‌(MP Santhosh) తెలిపారు. కోనరావుపేట మండలం సుద్దాల(suddala) గ్రామ శివారులో నేలకొరిగిన చెట్టు ఎండిపోయినట్లు కనిపించింది

అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాష్ రెండు నెలలుగా నీరు పోయడంతో చెట్టుకు జీవం వచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ ఈ చెట్టు గురించి తెలుసుకున్నారు. దానిని మార్చడానికి సహాయం అందించారు.

చెట్టును 6 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశానికి మార్చవలసి వచ్చినప్పుడు అసలు ఇబ్బంది వచ్చింది. చెట్టు సులభంగా రవాణా చేసేందుకు ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. చెట్టును మార్చేందుకు 70-టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్‌లను తీసుకొచ్చారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల అటవీ ప్రాంతంలో తల్లి చెట్టు నుంచి రెండు పెద్ద కొమ్మలను తీసి నాటినట్లు సంతోష్ కుమార్ తెలిపారు.

Read Also.. Hyderabad: మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్.. ఇద్దరు బాలికలకు ఆర్థిక సాయం..!