Hyderabad: మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్.. ఇద్దరు బాలికలకు ఆర్థిక సాయం..!

Hyderabad: మరోసారి మంచి మనసు చాటుకున్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పేదరికం కారణంగా ఉన్నత విద్య భారంగా

Hyderabad: మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్.. ఇద్దరు బాలికలకు ఆర్థిక సాయం..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 14, 2022 | 9:52 PM

Hyderabad: మరోసారి మంచి మనసు చాటుకున్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పేదరికం కారణంగా ఉన్నత విద్య భారంగా మారిన, ఇద్దరు బాలికలకు ఆర్థిక సాయం అందించారు మంత్రి. విద్యా, వైద్యం విషయంలో సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్. తాజాగా విద్యకోసం మరో ఇద్దరు బాలికలకు సాయం చేశారాయన. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన చెందిన ఆవునూరి అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు, తల్లి గృహిణి. అఖిల ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో పాసై, ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిలకు ఫీజులు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. అఖిల విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. చెప్పినట్టుగానే ఫీజుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన అఖిల కుటుంబంతో మాట్లాడి భరోసా ఇచ్చారు యంగ్‌ లీడర్.

అటు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. టిఆర్‌ఆర్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. కానీ స్పందన తల్లిదండ్రులు రోజువారి కూలీలు. దీంతో ఇబ్బందులు తప్పలేదు. దీంతో స్పందన చదువులకు కూడా అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. స్పందన MBBS చదవడానికి అవసరమైన ఆర్థిక సాయం చేశారు. ఈ ఇరువురు విద్యార్థినులతో, వారి కుటుంబాలతో మాట్లాడిన మంత్రి కేటీఆర్, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో, పట్టుదలతో విజయం సాధించాలని విద్యార్థునులను ప్రోత్సహించారు ఐటీ మంత్రి. అటు మంత్రి కేటీఆర్‌ సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థునుల తల్లిదండ్రులు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు.

Also read:

Andhra Pradesh: తండ్రిని మించిపోతున్న తనయడు.. కర్నూలులో చరిత్రను రిపీట్ చేసేనా!?

Valentain’s Day: వాలెంటైన్స్ డే రోజున ప్రియురాలి ఆవేదన.. ప్రేమకోసం ప్రేయసి పోరాటం.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Medaram History: సమ్మక్క పసితనంలో నడయాడిన నేల ఏదో తెలుసా?.. మేడారం జాతర అసలు హిస్టరీ ఇదే..!

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA